| << Newer | Older >> |
on 2008/10/3 4:56:48
చిత్తూరు జిల్లా రేణిగుంట లోని విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించనుంది. ఆ మేరకు అందిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఇటీవల యు. పి. ఏ. ఛైర్ పర్సన్ హోదాలో చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన సోనియా గాంధీ రేణిగుంట విమానాశ్రయానికి త్వరలో అంతర్జాతీయ హోదా ను కల్పించడానికి యు. పి. ఏ. ప్రభుత్వం నిర్ణయం తీసుకో నుందని ప్రకటించిన కొన్ని రోజులకే ఆది కార్య రూపం దాల్చడం విశేషం. దాదాపు 1000 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న రన్‌వే ని మరింత పొడిగించి పెద్ద విమానాలు దిగడానికి అవకాశం కల్పించనున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం వల్ల విదేశీ యాత్రికులు పెద్ద సఖ్యలో వచ్చే వీలుంది. ప్రస్తుత ఎయిర్ పోర్ట్ కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా అథారీటీకి బదలాయించనున్నారని తెలిసింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



