| << Newer | Older >> |
on 2008/7/21 11:08:17
తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. సి. ఆర్. రికార్డ్ సరస్తించారు. ఇప్పటి వరకు ఎవరు అలాంటి రికార్డ్‌ను సృశించలేదనే చెప్పాలి. ఇది చాలా అరుదైన రికార్డ్. ఒక లోక్ సభ సభ్యుడి పదవీకాలం అయిదేళ్ళు ఉంటుంది. ఒక వేళ ఏ కారంగా నైనా లోక్‌సభకు మధ్యంతర ఎన్నిక అంటూ జరిగితే గెలిచిన అభ్యర్థి తిరిగి పోటీ చేసి గళేవవచ్చు. మన కె. సి. ఆర్. తన అయిదేళ్ళ లోక్‌సభ సభ్యుని పదవి గడువు ముగియక మునుపే మూడు సార్లు ఎన్నికై రికార్డ్ సాదించారు. 2004 లో ఆయన టి. ఆర్. ఎస్. అభ్యర్థిగా కరీంనగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి భారీ మేజర్‌తీతో విజయం సాదించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన కె. సి. ఆర్. 2006 లో తన ఎం. పి.పదవికి, రాజీనామా చేసి తిరిగి కరీంనగర్ లోక్‌సభ కు పోటీ చేసి రెండు లక్షాల్ ఓట్లమేజారిటీ తో మళ్లీ ఎం. పి. గా ఎన్నికయ్యారు. తెలంగాణా సెంటిమెంట్ బలహీన పడలేదని నిరూపించడానికి 2008 లో 16 అసెంబ్లీ సీట్లకు నాలుగు లోక్‌సభ సీట్లకు రాజీనామా చేయించి తిరిగి పోటీ చేశారు. కరీం నగర్ లోక్‌సభ సీటుకు పోటీ చేసియన్ కె. సి. ఆర్. ముచ్చటగా మోడో సారి కూడా విజయం సాదించారు, అయితే ఈ సారి మెజార్టీ కేవలం 15 వేలు మాత్రమే ఏమైత్ నేమ్ కె. సి. ఆర్. నాలుగునారేళ్లలో మూడు సార్లు పార్లమెంట్ కు ఒకే నియోజక వర్గం నుంచి ఎన్నికై రికార్డ్ సృష్టించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



