| << Newer | Post Comments | Older >> |
రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ రాష్ట్రపతి గా ఎన్నికైన తరువాత మొదటి సరిగా రాజకీయ విషమ పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతో అన్ని రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు అందరు రాష్ట్రపతి పై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రపతి ఎం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు, ఎలా పరిష్కరిస్తారని చర్చించుకొంటున్నారు. బుదవారం రాష్ట్రపతి భవన్ లో రాజకీయ సందడి కనిపించింది. మధ్యాహ్నం వామపక్ష కూటమి బృందం రాష్ట్రపతి ని కలిసి యు. పి. ఏ. ప్రభుత్వానికి మద్దత్తును ఉప సంహరిస్తున్నట్లు ఒక లేఖను . వీలైనంత త్వరగా పార్లమెంట్ విశ్వాసాన్ని పొందేల చూడాలని ప్రదానిని ఆదేశించాలని కూటమి రాష్ట్రపతిని కోరింది. ఆ తరువాత సమాజ్‌వాదీ పార్టీ తరుపున అమర్ సింగ్ రాష్ట్రపతిని కలిసి యు. పి. ఎ.కు తమ పార్టీ మద్దత్తు ఇస్తునట్లు తెలుపుతూ మద్దత్తు లేఖను సమర్పించారు. గత ఏడాది జూలై 22 న రాష్ట్రపతి గా ప్రతిభ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఏడాది కూడా పూర్తి కాకుండానే మొదటి సరిగా ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించాల్సి రావడంతో ఇది ఆమె దక్షతకు, రాజకీయ పరిణతికి పరీక్షగా మారింది. 59 మంది సభ్యులతో కూడిన వామపక్ష కూటమి గత నాలుగేళ్లుగా యు. పి. ఏ. కు బైటి నుంచి తన మద్దత్తును అందజేసింది. అణు ఒప్పందం విషయం లో యు. పి. ఏ. , వామపక్షల మద్య అభిప్రాయబేధాలు ఉన్నాయి. ఒప్పందం విషయం లో యు. పి. ఏ., వామపక్షాలు తమ పంతమే నెగ్గాలని అనుకోవడంతో చివరికి వామపక్ష కూటమి ప్రభుత్వానికి మద్దత్తును ఉప సంహిరించింది. ఫలితంగా ప్రధాని మన్మోహన్ పార్లమెంట్ విశ్వాసాన్ని పొందటం తప్పనిసరిగా మారింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యు. పి.ఎ. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసాన్ని ఎప్పుడు, ఎలా పొందలన్నది రాష్ట్ర పతి నిర్ణయించాల్సి ఉంది. ప్రధాని రేపు విదేశీ పర్యటన నుంచి తిరిగి రానున్నారు. వీలైనంత త్వరగా లోక్ సభ విశ్వాసాన్ని పొందాలని ఆమె యు. పి. ఏ. ప్రభుత్వం పై వత్తిడి చేస్తారా లేకపోతే విపక్షాలు రాష్ట్రపతి పై వత్తిడి తీసుకవస్తాయా అన్నది చూడాలి.


