| << Newer | Older >> |
on 2008/7/17 18:11:34
విశ్వాస పరీక్షలో చిన్న పార్టీల తరుపున చక్రం తిప్పడానికి సిద్దమైన తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. సి. ఆర్. పలు పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణకు మద్దత్తును కూడగట్టడం లో బాగంగా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఒక పక్క మాయా వతి తోనూ, మరోపక్క వామపక్షాలతోనూ, ఇంకోపక్క బి. జె. పి. తోనూ మంతనాలు సాగిస్తున్నారు. బి. జె. పి. కి దూరంగా ఉండాలని మొదట అనుకున్నా ఇపుడు ఆ పార్టీ తో చర్చలకు సిద్ద మయ్యారు. చిన్న రాష్ట్రాల కు తాము అనుకూలమని బి. జె. పి. ప్రకటించింది. కేంద్రం లో ఎన్. డి. ఏ. కూటమి తిరిగి తన కూటమిని పటిష్ట పరుచుకునే పనిలో పడింది. విశ్వాస పరీఖలో యు.పి. ఏ. ను ఓడించడానికి యు. పి. ఏ. ను వ్యతిరేకిస్తున్న చిన్న పార్టీలతో చర్చలు జరుపుతోంది. దానిలో బాగంగా టి. ఆర్. ఎస్ పై బి, జె. పి. చూపు సారించిఒందీ. ఈ అవకాశాన్ని కె. సి. ఆర్. కూడా ఉపయోగించుకోడానికి సిద్దమయ్యరు.బి. జె. పి. జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ తో చర్చలు జరుపుతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




