| << Newer | Older >> |
on 2008/6/19 6:40:22
రాష్ట్రం లో రాజకీయ సమీకరణాల పై జోరుగా చర్చలు సాగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందని అన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి కారంగా ఏడుచొస్తోంది. తాం ఆపాత మిత్రులతో పొత్తుకు తాము ఇప్పటి సిద్దమే నని పి. సి. సి. చీఫ్ డి. శ్రీనివాస్ చెబుతున్నారు. మరో పక్క ముఖ్య మంత్రి కూడా పొత్తుకు సిద్దం అని చెబుతూనే పొత్తులు కుదారి పక్షం లో ఒంటరి పోటీకి సై అంటూ మీసం దువ్వు తున్నారు. రానున్న ఎన్నికలను పార్టీని సన్నడం చేయడం లో బాగంగా పార్టీలో భారీ మార్పులకు కసరత్తు జరుగుతోంది. తమ పార్టీ ప్రభుత్వం సాదించిన అభివృద్ది రానున్న ఎన్నికల్లో తమకు విజయాన్ని చేకూర్చీ పెడుతుందని ఒక పక్క ముఖ్య మంత్రి, మరో పక్క పి. సి. సి. చీఫ్ ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ ని ఏర్పాటు చేసినా రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పోటీకి దిగే అవకాశాలు తక్కువ అని కాంగ్రెస్ పార్టీయంటుంది. ఇప్పటిదాకా పార్టీ ఏర్పాటు పై ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. రాజకీయ పార్టీ ని ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ చేయించాలి, ఆ త్రువత చిరు పార్టీ తన రాజకీయ , ఆర్థిక ,సామాజిక విధానాలను వెల్లడించాలి. ఇప్పటిదాకా ఆ పార్టీ ఇంకా తన విధానాలను ఖరారు చేయలేదు. పోతే ఒక్క సినీ గ్లామర్ మాత్రమే ఓట్లు కురిపించవని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. చిరు పార్టీ రాష్ట్ర రాజకీయాలను పెద్దగా ప్రభావితం చేయలేదని కాంగ్రెస్ పార్టీ వాదన. ఎన్నికలకు ఆ పార్టీ ఇంకా సన్నద్దం కాలేదని ఈ కారణాల వల్ల చిరు పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువని కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ చేస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




