Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>



తెలంగాణా విషయం లో రాజకీయ నిర్ణయం జరగాలే తప్ప మరే విదం గాను తెలంగాణా వాదానికి స్వస్తి పలకడం కుదరని పని అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తరువాత తెలంగాణా సమస్య కు పరిష్కారం దొరకాలంటే రాజకీయ నిర్ణయమే సరైనదన్న వాదన వినిపిస్తోంది. సంయుక్త మద్రాస్ నుంచి ఆంద్ర విడిపొయినప్పుడు కూడా రాజకీయ నిర్ణయం జరిగిందే తప్ప మరేమీ కాదు. అప్పటి ప్రదాన రాజకీయ పార్టీలకు చెందిన పెద్దలు సమావేశమై ఇచ్చి పుచ్చుకోనే దో రణిలో వ్యవహరించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సమస్యను నాన్చడం కన్నా ఒక పరిష్కారాన్ని వీలైనంత త్వరగ కనుగొనాలి. ఏ రాష్ట్రం మను గడకైన నదీజలాల అవసరం ఎంతో ఉంది. నదీజలాల ఆదారంగా కూడా రాష్ట్ర ఏర్పాటు జరిగేతే బాగుంటుందన్న సూచనలు గతం లోనే వచ్చాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే ముందు ముందు తెలంగాణా ప్రాంతంలో ప్రవహించే కృష్ణ, గోదావరి నది జలాలను ఇతర రాష్ట్రాలకు రాకుండా అడ్డుకట్ట వేస్తే భవిష్యత్తులో దిగువ ప్రాంతాల వారు భారీగా నష్టపోయి అవకాశం ఉంది. కేంద్రం లోగాని , రాష్ట్రం లో కానీ రాజకీయ నిర్ణయం జరిగితే తప్ప తెలంగాణా సమస్యకు పరిష్కారం దొరకాడన్నది సుస్పష్టం. ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తెలంగాణా వాదం సజీవంగానే ఉంది అని అర్థం అవుతోంది అయితే టి. ఆర్. ఎస్. కు పూర్తిగా ఎందుకు మెజారిటీ రాలేదు అన్న సందేహం కలుగక మానదు. ఒంటరి పోరులో టి. ఆర్. ఎస్. 7 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు దక్కించుకుంది. పార్టీలోని కొందరి నిర్వాకం వల్ల కొన్ని సీట్లు కోల్పోవడం పై కె. సి. ఆర్. దృష్టి పెట్టారు. పార్టీకి ద్రోహం చేసినవారిపై కఠిన చర్యలకు సిద్దం అవుతున్నారు. ఇక అభివృద్ది మంత్రం జపీంచిన కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణా లో అంత అభివృద్ది జరిగి ఉంటే తెలంగాణా ప్రజలు ఆ పార్టీని ఆదరించాలి. అయితే కేవలం 5 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే తెలంగాణాలో అభివృద్ది మంత్రం పెద్దగా పనిచేయలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. గుడ్డిలో మెల్ల అనట్లు టి. ఆర్. ఎస్. కు ఓట్ల శాతం పెరిగింది. ఇవన్ని పరిశీలిస్తే తెలంగాణా సనశ్య పరిష్కారానికి రాజకీయ నిర్ణయం సరైనదని చెప్పాక తప్పదు. ఈ విషయాన్ని యు. పి. ఏ. గమనించాలి.






Related Stories:

  • షూటింగ్ లకు లాంగ్ లీవ్ పెట్టిన పవన్
  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • చిరు ను కలిసిన శత్రు
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • ఎన్నికల బరిలొదిగనున్న జగన్
  • చిరు మెదక్ జిల్లా టూర్ నేటి నుంచి
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • స్పీకర్ నిర్ణయం ఏమిటో
  • దేవేందర్ రాజకీయం
  • చిరు రంగా రెడ్డి పర్యటన 26 నుంచి
  • చిరు ముందు తెలంగాణా చిక్కు ముడి
  • మరింత తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
  • చట్టం తన పని తాను చేసింది: సజ్జనార్
  • పి. ఆర్. పి. లోను అదే తంతు
  • మత్స్య శాఖ అవినీతి పై విచారణ
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • ఇక చిరు మిని అంకిత యాత్రలు 18 నుంచి
  • బి. జె. పి. తో పొత్తు ఉండదు: చిరంజీవి
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |