| << Newer | Post Comments | Older >> |
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను తప్పుకోనున్నట్లు లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ చెబుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక తాను పోటీ చేయదలుచుకోలేదని అంటున్నారు. రాజకీయాల నుంచి తాను శెలవు తీసుకోనున్నట్లు మాట్లాడుతున్నారు. లోక్‌సభ స్పీకర్ గా సభను చక్కగా నిర్వహించిన సోమ్‌నాథ్ అందరి మన్నాలను పొందారు. యు. పి. ఏ. ప్రధాని మన్మోహన్ పై విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సందర్బంగా సి. పి. ఎం . పార్టీ తరుపున ఎం. పి. గా ఎన్నికైన సోమ్‌నాథ్ స్పీయక్ర్ పదవికి రాజీనామా చేయాలని సి. పి. ఎం . కోరింది. ఆయన దానికి అంగీకరించలేదు. రాజకీయాలకు ఆతీతమైనది స్పీకర్ పదవి అని చెప్పారు. లోక్ సభ లోని అన్ని పార్టీలు కలిసి తనను స్పీకర్ గా ఎన్నుకున్నాయని చెప్పారు. స్పీకర్ పదవికి రాజీనాం చేయని సోమ్‌నాథ్ ను పార్టీ సస్పెండ్ చేసింది. అయిన ఆయన చలించలేదు.


