| << Newer | Post Comments | Older >> |
రాష్ట్ర రాజకీయాలు రస కందా యం లో పడ్డాయి. రానున్న ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల తరుపున ప్రచారానికి సినీ నటులు రంగం లోకి దిగనున్నారు. రాజకీయ పార్టీల తరుపున సినీ నటులు ప్రచారాలు జరపడం కొత్త కాకపోయినా ఈ సారి మాత్రం రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన సత్తా సినీ నటులకే ఉందని అన్ని పార్టీలు బావిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం తో కాంగ్రెస్ కన్నా తెలుగు దేశం పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. రాష్ట్ర రాజకీయాలను చిరంజీవి ప్రభావితం చేస్తారని అనుమానిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చిరు పార్టీని ఎదుర్కోడానికి ముల్లును ముల్లు తోనే తియాలన్న సూత్రాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాయి. చిరు ను నిరోధించడానికి టి. డి. పి. నందమూరి నట వారసులను రంగం లోకి దింపనుండటం తో, కాంగ్రెస్ కూడా కృష్ణ ,మహేష్ బాబుల సేవలను వినియోగించుకోవడానికి పావులను వేగంగా కదుపుతోంది.
దానిలో బాగంగానే నట శేఖర కృష్ణ, ఆయన కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి వారి పై వత్తిడి తీసుకొచ్చింది. దాంతో కృష్ణ ముఖ్య మంత్రిని కలిసి పార్టీ తరుపున తాను ప్రచారం చేస్తానని చెప్పారు. మహేష్ బాబును ఇప్పుడే రాజకీయాల్లోకి లాగడం సరికాదని అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం కోసం కృష్ణ, మహేష్ అభిమా సంఘాలు కలిసి కట్టుగా పని చేయాలని కృష్ణ బావించారు. ముఖ్య మంత్రి వై.ఎస్. నేతృత్వం లోని కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలన్న లక్ష్యం తో కృష్ణ మహేష్ అభిమాన సంఘాలను కలిపి మహేష్ -కృష్ణ సేన ను అవిర్బవించనుంది. ఈ నెల తొమ్మిదో తేదీ విజయదశమి రోజున మహేష్-కృష్ణ సేనలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పద్మాలయా స్టూడియో వద్ద అభిమానుల కొలాహాలం కనిపిస్తోంది. జన సౌభాగ్యమే లక్ష్యం అన్న ట్యాగ్ లైన్‌తో తో ఈసేన సామాజిక సేవ కార్యక్రమాలతో ప్రజలకు మరించ చేరువ కావాలని బావిస్తోంది. టి. డి. పి. కి, ప్రజారాజ్యం పార్టీలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ తరుపున కృష్ణ- మహేష్ సేన పని చేస్తుందా అన్నది వేచి చూడాలి.


