| << Newer | Older >> |
on 2008/5/12 5:44:49
రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు భూ బాగోతం పై సోమవారం శ్రీకాకుళం లో జరిగిన ఓపెన్ ఫోరం లో రసా బాస జరిగింది. ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం. పి. ఎర్రం నాయుడు రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన రాలేదు. తనపై చేసిన అర్పోణలపై ఎర్రం నాయుడు వెన్నక్‌కు తగ్గడం గురించి ధర్మాన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ చర్చలో పాల్గొనడానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేత లు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్య లో హాజరు కావడం తో పాటు, ప్రతిపక్ష పార్టీల నేతల ప్రసంగాలకు కాంగ్రెస్ కార్యకర్తలు అడుగడుగున అడ్డుతగలడం తో పాటు వారు మాట్లాడకుండా అడ్డు పడటం తో గందర గోళం ఏర్పడింది. ఈ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఎర్రం నాయుడు చర్చలో పాల్గొనడానికి రాకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు ప్రముఖంగా ప్రసంగిస్తూ మంత్రి పై చేసిన ఆరోపణలను నిరూపించలేకనే ఎర్రం నాయుడు వెన్నక్‌కు తగ్గారని అన్నారు. ముందుగా సమాచారంలేని కారణంగా ఎర్రం నాయుడు రాలేక పౌయరని తెలుగు దేశం నేతలు అంటున్నారు. సమావేశం లో చోటు చేసుకున్న గందరగోళం వల్ల అసలు విషయం పక్కదారి పట్టింది. పైగా మంత్రి ధర్మాన చాలా ఆవేశానికి లోనై గట్టిగా ప్రసంగించారు. ఆవేశం తో ఉగి పోయారు. ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఈ చర్చకు వచ్చి అసలు అంశం ప్రస్తావనకు రాకుండా అడ్డంకులు సృస్టించారని విపక్ష నేతలు ఆరోపించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




