Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>








రాజకీయాల్లోకి యువత రావాలని, యువతకు రాజకీయాల్లో పెద్ద పీట వేస్తామని అన్ని పార్టీలు చెబుతున్న మాటలన్ని ఊక ధంపుడు ఉపన్యాసాలే నని ఎప్పటికప్పుడు స్పష్టం అవుతున్నాయి. ఎన్నికల సమయం లో యువత గురించి గొప్పగా చెప్పే పార్టీలు తమ చర్యలన్ని మాటలకే పరిమితచేస్తున్నాయి. చేత ల్లోకి వచ్చే సరికి వాటిని ఆచరించడంలో ఏ మాత్రం శ్రద్ద చూపడం లేదు. జనాభాలో 40 శాతం మంది యువత ఉన్నారు. తమ విషయం లో పార్టీలకు చిత్త శుద్ది లేదని యువత కూడా వాపోతోంది. దీనికి తమ పార్టీ కూడా మినహాయింపు కాదని రాజకీయాల్లో కి కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ కూడా రుజువు చేస్తోంది.


తమ పార్టీ మిగత పార్టీ లాంటిది కాదని యువతకు అధిక ప్రదాన్యత ఇస్తామని , నవ రాజకీయాన్ని ఆవిష్కరిస్తామని ప్రజారాజ్యం పార్టీ అదినేత తన పార్టీని స్థాపించే సమయం లో గొప్పగా చెప్పారు. తమ పార్టీకి యువతే కీలకం అని అన్నారు. అయితే ఆచరణలోకి వచ్చే సరికి ఆది కాస్త ఆవిరి అవుతోంది. చిరంజీవి పార్టీలోకి ఇప్పటిదాకా చేరిన వారంతా వృద్దులే. వృద్దా రాజకీయ నాయకులకే పెద్ద పీట వేస్తున్నారు. అదేమంటే పార్టీకి యువత తో పాటు అనుభవజ్ఞులు కూడా అవసరమే నన్న కొత్త వాదన ఒకటి లేవదిస్తున్నారు.

ప్రజారాజ్యం పార్టీలో చేరిన వారిలో మెజార్టీ శాతం వృద్ద నేతలే కనిపిస్తున్నారు. చెగొండి హరిరామ జోగయ్య, కోటగిరి, కె. ఎస్. ఆర్. మూర్తి , శేష రెడ్డి, ఎం. వి. రమణ రెడ్డి, శివశంకర్, ఇలా పేర్లు చెబుతూ పోతే జాబితా చెంతాడంత ఉంది. యువత కే ఆగ్రా స్థానం అని ఉదరగొట్టిన చిరంజీవి ఆచరణకు వచ్చే సరికి తమకు మొండి చేయి చూపుతున్నారని యువత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొని వస్తామని చెప్పిన చిరంజీవి దాన్ని విస్మరిస్తున్నారని యువకులు వాపోతున్నారు. యువత తో పాటు అనుభవానికి సమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన చిరంజీవి తన పార్టీలో యువకులకు ఇంకా ఎలాంటి స్థానం కల్పించలేదు. వారికి అవకాశం ఇవ్వడం లేదు. అవకాశం ఇస్తే తమకు కూడా అనుభవం వస్తుందని యువత వాదిస్తోంది. చిరంజీవి గారు! యువత వాదన వినిపిస్తోందా!!







Related Stories:

  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • ప్రజాభిప్రాయం మేరకే మ్యాని ఫెస్టో
  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • సత్యం పై చర్యలు: సెబీ
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • చిరు రంగా రెడ్డి పర్యటన 26 నుంచి
  • ఆచొచ్చిన స్టేడియం లో ఆదరగొట్టిన సచిన్
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • ప్రయోగాలకు సిద్దం అవుతున్న ధోని
  • వికారుద్దీన్ కు లష్కరే తో సంబందం?
  • మరింత తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
  • నల్లమల ఏరియా లో మావో ల కదలికలు
  • పదవులకోసం పార్టీ మార్చలేదు: గాలి
  • యువతకు రాజకీయాల్లో చోటెది?
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బి. జె. పి. తో పొత్తు ఉండదు: చిరంజీవి
  • చిరు మెదక్ జిల్లా టూర్ నేటి నుంచి
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |