| << Newer | Older >> |
on 2008/6/6 9:23:47
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ మౌ నన్ని పాటిస్తూ తన అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజల సహా నాన్ని కూడా పరీక్షిస్తున్నారని అనిపిస్తోంది. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఆయన బావమరిది అల్లు ఆరవింద్, వచ్చే అన్నికల్లో తన ఓటు అన్నయ్యకే నని చిరు సోదరుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రకటించినా ఆ విషయాన్ని చిరంజీవి మాత్రం చెప్పకుండా అభిమానులతో పాటు పలు రాజకీయ పార్టీలను ఉరిస్తున్నారు. చిరంజీవి పార్టీ పేరు ఖరారు అయిందని, ఆయన పార్టీ గుర్తు కూడా నిర్ణయించారని, పార్టీ జెండాకు రూపకల్పన జరిగిందని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వివరాలన్నీ చిరంజీవి అంతరగికులనుంచి మీడియాకు అందిన సమాచారమే అన్నది బహిరంగ రహస్యం. అయితే మరుసటి రోజు మీడియాలో వచ్చిన వార్త లన్ని ఉహాగానాలని అల్లు ఆరవింద్ కొట్టిపాడేయడంతో చిరంజీవి అభిమానులతో పాటు చిరు పార్టీ పై కొండంత ఆశలు పెట్టుకున్న వారు కూడా నీరుగారి పోయారు. లోపల జరుగుతున్న విషయాలు చిరంజీవికి తెలియదని చెప్పడానికి వీలులేదు. ఆయన అనుమతి లేకుండా వివరాలు బైటకు రావు అన్నది నగ్న సత్యం. ప్రజలతో పాటు అభిమానుల స్పందన తెలుసుకోడానికి ఇలాంటి పని చేశారని అను కొందమంటే ఇప్పటికే అలాంటివి చాలా జరిగాయి. ప్రతి సారి ఇలా చేయడం వల్ల మంచి కన్నా చేదు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. తాను రాజకీయాల్లోకి వస్తాను. రాను అన్న విషయాన్ని సూటిగా అభిమానులకు చెప్పడానికి చిరంజీవి ఎందుకు త ట ప ట ఇస్తున్నారో అర్థం కావడం లెదు.ఒకసారి అల్లు ఆరవింద్ మరో సారి మరొకరు చిరంజీవి తరుపున మాట్లాడటం కన్నా తన మనో భావాన్ని నేరుగా చిరంజీవి చెబితే అభిమానులు, ప్రజలు అర్థం చేసుకుంటారు. అలాకాకుండా మూడునెలాకోసారి పార్టీ వచ్చేస్తుందని హడావుడి చేసి ఆ తరువాత మిన్న కుంటే అభిమానుల్లో, ప్రజల్లో చిరంజీవి పట్ల ఆసక్తి సన్న గిల్లు తుంది. ఒకవెలరేపు ఎప్పుడైనా తాను పార్టీ పెడుతున్నట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించినా ప్రజలు అభిమానులు నమ్మక పోవచ్చు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడానికి గోప్యం అనవసరం. ఒక తేదీని నిర్ణయించుకొని ఆ తేదీకి పార్టీ పెడుతున్నట్లు వెల్లడించడం సబబుగా ఉంటుంది. అలోగా పార్టీ విధి విధానాలు రూపొందించుకోవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం అన్ని జరగాలి. ప్రజలను అభిమానులను ఉరించడం మాని పార్టీ పెడుతున్నాదీ లేనిది చిరంజీవి నేరుగా ప్రకటించడం ఎప్పటికైనా శ్రేయస్కరం.! కాదంటారా చిరంజీవి గారు !!
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




