| << Newer | Older >> |
on 2008/5/8 4:52:06
విధ్యార్థుల్లో మెడిసిన్ పై మోజు తగ్గుతున్నట్లు ఈ సారి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరైన విధ్యార్థుల సంఖ్య స్పష్టం చేసింది. అదే సమయంలో ఇంజనీరింగ్ పై విధ్యార్థుల్లో మక్కువ ఎక్కవుగా ఉన్నట్లు కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా గురవరం 667 కేంద్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం మొత్తం 2, 70 636 మంది విధ్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు, ఇక మెడిసిన్ అగ్రికల్చర్ కోసం 79, 752 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విషయానికి వస్తే గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎంట్రెన్స్ కు ధరఖాస్తులు దాఖలు చేసుకున్న విధ్యర్థుల సంఖ్య 76 వేలకు పెరిగింది. అంటే దాదాపు 46 శాతం ఎక్కువ అన్నమాట. ఇక మెడిసిన్ విషయానికి వస్తే ఆ సంఖ్య బాగా తగ్గింది. ప్రవేశ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి 22 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి కటాఫ్ మార్కులను 25 శాతం గా నిర్ణయించారు. మెడిసిన్ , అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు మధ్యాహన్నం 2.30 నుంచి సాయంత్రం 5.30. గంటల దాకా జరుగుతుంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



