| << Newer | Post Comments | Older >> |
కోడిగుడ్డు వివాదం ముదిరింది. ఆది రెండు పార్టీల మద్య నిప్పు రాజేసింది. దాంతో ఆ రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఇక ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన మలి విడత తెలంగాణా పర్యటనలో తెలంగాణా ప్రాంతం దాటే లోగా తెలంగాణా అంశం పై ఒక స్పష్ట మైన వైఖరిని వెల్లడిస్తానని చెప్పారు. అలాగే ఆయన వరంగల్ జిల్లా లో నిర్వహించిన రోడ్ షోలో తమ పార్టీ వైఖరిని వెల్లడించారు. కేంద్రం తెలంగాణాను ఇస్తా మంటే తమ పార్టీ అడ్డు చెప్పబోదని ప్రకటించారు. తెలంగాణా ప్రజల మనో భిష్టాన్ని తమ పార్టీ గౌరవిస్తుందని కూడా చిరంజీవి వెల్లడించారు. ఇక సామాజిక తెలంగాణా గురించి ప్రతి రోడ్ షోలోనూ ముచ్చటించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో రోడ్ షో నిర్వహిస్తున్న చిరంజీవి కి టి. ఆర్. ఎస్. కార్యకర్తల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణాపై స్పష్ట మైన ప్రకటన చేయాలన్న డిమాండ్ వినిపించింది. తమ పార్టీ విధానాన్ని చెప్పినా దానికి అంగీకరించని టి. ఆర్. ఎస్. కార్యకర్తల్లో కొందరు ఆయన పై కోడిగుడ్లను విసిరారు అవి ఆయనపై పడి సొన అంత చొక్కాపై తలపై పడ్డాయి. చిరంజీవి దాంతో మనస్తాపనికి గురయ్యారు.
ఈ చర్యను టి. ఆర్. ఎస్. ఖండించింది. అయితే కోడిగుడ్లు విసిరింది తమ పార్టీ కార్యకర్తలు కారని ప్రకటించింది. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు టి. ఆర్. ఎస్. పార్టీకి చెందిన వారని సమాచారం. తెలంగాణా ప్రాంతంలో టి. ఆర్. ఎస్. ప్రమేయం లేకుండా ఇలాంటి దాడులు జరగవని పి. ఆర్. పి. వాదన. గుడ్లు విసిరింది తమ వారు కాదని ఆ సంఘటంలో తమ వారి ప్రమేయం లేదని టి. ఆర్. ఎస్. కూడా ఖచ్చితంగా వాదించడం పి. ఆర్. పి.కి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇక టి. ఆర్. ఎస్. తో పొత్తు గురించి ఆలోచించరాదన్న నిర్ణయానికి రావడం తో కె. సి. ఆర్. కూడా కాస్త కటువుగానే స్పందించారు. ఫలితంగా రెండు పార్టీల మద్య వివాదం ముదిరి పాకాన పడింది
చిరంజీవి ని కలిసి సర్ది చెప్పాలని కె. సి.అర్ మొదట్లో అనుకున్నా పి. ఆర్. పి. మాత్రం డానికి ఛాన్స్ ఇవ్వకూడదని గట్టి పట్టుదలకు పోవడం తో రెండు పార్టీల మద్య స్నేహపూర్వక వాతావరణం దెబ్బతింది. ఇక ముందు ప్రజారాజ్యం పార్టీ టి. ఆర్. ఎస్. పార్టీ పై విమర్శలు గుప్పించాలని నిర్ణయించుకుంది. చిరంజీవి తన తెలంగాణా ప్రాంత పర్యటనలో దొరల పాలన గురించి ప్రస్తావించారు. పరోక్షంగా ఆయన కె. సి. ఆర్. ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపించింది. చిరంజీవి దొరల పాలన గురించి మాట్లాడిన తరువాతనే ఆయన పై మరుసటి రోజు కోడిగుడ్లు పడ్డాయి. ఆది కాకతాళీయమో, మరేమో తెలియదు కాని మొత్తానికి దొరల పాలన గురించి చిరంజీవి ముచ్చటించిన తరువాత ఆయన పై కోడిగుడ్లు పడటం తో ఆది టి. ఆర్. ఎస్. పనే అని పి. ఆర్. పి. గట్టిగా నమ్ముతోంది. ఆ తరువాత కూడా నాగబాబు కోస్తా ప్రాంతం లో పర్యటిస్తూ దొరల పాలన గురించి మాట్లాడారు.
ఇక పి. ఆర్. పి. తీసుకున్న నిర్ణయాన్ని తెలుసుకున్న కె. సి. ఆర్. కూడా తీవ్రంగానే స్పందించారు. తెలంగాణా పర్ంతం లో చిరంజీవి ఎలా పర్యటిస్తారో చూస్తామని అన్నారు. ఆయనతో పొత్తుకు వెంపర్లదటం లేదని కూడా చెప్పారు. చిరంజీవి పార్టీ ఎంత? దానికోసం తాము ఆరాట పడటం ఏమిటని అంటున్నారు. మొత్తనకి వివాదం బాగ్ ముదిరింది. ఇక ఆ రెండు పార్టీల మద్య పొత్తుకు ఆస్కారం లేదని ఇప్పటికైతే చెప్పవచ్చు. ఇవి రాజకీయాలు. ఈ రోజు మాట ఈ రోజే. రేపటికీ మాట మారవచ్చు రెండు పార్టీలు కలిసి పనిచేయవచ్చు. ఎం జరగడానికైన ఆస్కారం ఉంది. రాజకీయాల్లో కోప తాపాలు అసలు పనికి రావు. కె. సి. ఆర్. నే చూడండి. తెలంజ్న ఇస్తామని తమతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల తరువాత ఇప్పటికీ తెలంగాణా పై ఎటు తేల్చని కాంగ్రెస్ ను తిట్టిన తిట్టూ తిట్టకుండా తిడుతున్నారు. రేపు కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ తో కలిసి పని చేస్తామని జంకు గొంకు లేకుండా చెబుతున్నారు. ఆది రాజకీయమంటే.!


