| << Newer | Older >> |
on 2008/10/7 11:14:37
భారత క్రికెట్ చరిత్రలో మరో అద్బుత క్రికెటర్ శకం ముగిసింది. బెంగాల్ టైగర్ గా అందరు ముద్దుగా పిలుచుకునే కోల్ కత్త ప్రిన్స్ గంగూలీ అంతర్ జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నారు. ఆస్ట్రేలియా తో జరగనున్న సీరీస్ గంగూలీకి చివరి సీరీస్ కానుంది. ఆ సీరీస్ తరువాత గంగూలీ ఇక క్రికెట్ కు దూరం కానున్నారు. దాదా అని అందరు ముద్దుగా పిలుచుకునే గంగూలీ ఒకప్పుడు తన అద్బుత మైన ఆటతో అందరినీ అలరించారు , ప్రత్యర్థులకు ద డ పుట్టించాడు. ఎన్నోసార్లు భారత్ కు ఒంటి చేతి తో విజయాలను సాదించి పెట్టాడు. జట్టు క్యాప్టెన్‌గా కూడా గంగూలీ తన డైన ముద్ర వేశాడు. ఎన్ని చేసినా ఎం లాభం ఫాం కోల్పోతే ఎంతటి వారైన క్రికెట్ కు దూరం కావాల్సిందే. మునుపంతతి హుషారు ఇపుడు అతనిలో కనిపించడం లేదు. బోర్డ్ పెద్దాలతో, కోచ్ తో వివాదాలు గంగూలీ ని ఇబ్బందులకు గూఎి చేసింది. ఇక గంగూలీ తమకు ఐరావతమని బావించిన బోర్డ్ అతన్ని వదిలించుకోడానికి సెలెక్షన్ కమిటీకి కొత్తగా ఎంపిక చేసిన ఛైర్మన్ శ్రీకాంత్ ను ప్రయోగించింది. పాము చవకుండా, కర్ర విరగకుండా గంగూలీని గౌరవ ప్రదంగా బైటకు పంప డానికి నిర్ణయించింది. ఆస్ట్రేలియా తో జరగనున్న సీరీస్ కు మాత్రమే పరిమితం కావాలన్న కండిషన్ తో గంగూలీ ని ఎంపిక చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గంగూలీ మంగళవారం తన రెటైర్ మెంట్ గురించి చేసిన ప్రకటన కూడా ఆ వాదాన్ని బలపరిచేలా ఉంది. 16 ఏళ్ల పాటు భారతే క్రికెట్ కు తన సేవలను అందజేసియన్ గంగూలీని ఇంత అవమాన కార రీతిలో పంపడం మరి దారుణమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. వందకు పైగా టెస్ట్‌ల్లో ఆడియన్ గంగూలీ దాదాపు ఎనిమిది వేల పరుగులు చేశారు. సచిన్ తరువాత అంతటి గొప్ప బ్యాట్‌మెంగ గంగూలీని పరిగణించవచ్చు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



