| << Newer | Post Comments | Older >> |
రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎం. ఎస్. ఆర్. అరె ఇది నిజంగా సంచలన వార్త ! ఎం .ఎస్. ఆర్. ముఖ్య మంత్రి ఎప్పుడయ్యారు? అని ఆశ్చర్య పోతున్నారా! అవునండి ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. తన చిర కాల కల ను సాకారం చేసుకున్నారు. ఆ వైనం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వార్తను పూర్తి గా చదవాల్సిందే. సంచలనాల మంత్రిగా పేరుపొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు ప్రస్తుతం ఆర్. టి. సి. ఛైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి గానో. రాష్ట్ర గవర్నర్ గానో తనను నియమిస్తే బాగుంటుందని పలు సందర్భాల్లో ఆయన తన మనసులోని మాటను బైట పెట్టారు. వై. ఎస్. తన చలువ వల్లనే ముఖ్య మంత్రి అయ్యారని. ఆయన ముఖ్య మంత్రి కావడానికి తాను ఎంతో సహక రించానని చెప్పేవారు. ఎం. ఎస్. ఆర్. రుణం తనాకెందుకనుకున్నారో ఏమో ముఖ్య మంత్రి వై. ఎస్. కూడా పెద్దాయానను ముఖ్య మంత్రిగా చూడాలని అనుకున్నారు. ఎం. ఎస్. ఆర్ కోర్కేను తీర్చారు. ఆది నిజ జీవితం లో కాదు. రీల్ జీవితం లో సినీ నటుడు రాజషెకర్ 'సత్యమేవ జయతే' అన్న చిత్రం లో నటిస్తున్నారు. ఆ చిత్రానికి సంబందించిన ముహూర్తం షాట్ కు వై. ఎస్. క్లాప్ కొట్టారు. నిజజీవితం లో తన డ్రీమ్ రోల్ అయిన ముఖ్య మంత్రి పాత్రను పోషించే అవకాశాన్ని నటుడు రాజశేఖర్ ఆర్. టి. సి. ఛైర్మన్ ఎం. ఎస్. ఆర్. కు కల్పించారు ఎం. ఎస్. ర. , రాజశేఖర్ ల పై ముహూర్తం షాట్ కు శనివారం ముఖ్య మంత్రి క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. నిజజీవితం లో కాకపోయినా సినిమాలో నైనా తాను ముఖ్య మంత్రి అవడం పై ఎం. ఎస్. ఆర్. చాలా సొంతోషంగా కనిపించారు. కనీసం ఈ వీడంగా నైనా ఆయన కోర్కె తీర్చగలిగానని వై. ఎస్. కూడా హ్యాపీగా ఫీలయ్యారు..


