| << Newer | Post Comments | Older >> |
రాష్ట్రంలో జరగనున్న 18 అస్సెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికలు పరిశీలిస్తే తెలంగాణా ప్రాంతంలోని 16 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాల ఎన్నికలు కోరి కొని తెచ్చుకున్నవే. తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉందన్న బ్రామను వీడని టి. ఆర్. ఎస్. అధినేత కె.సి. ఆర్. తాను ఏడేళ్లుగా పెంచి పోషిణ తెలంగాణా ఉధ్యమం నీరుగారిపోకుండా చూసుకోడానికి గాను ప్రజల నెత్తిన ప్రత్యేకించి తెలంగాణా పై బలవంతంగా రుద్దిన ఈ ఉప ఎన్నికలు టి. ఆర్. ఎస్ కు ఏ మాత్రం లాభంమ్ చేకూర్చడని గట్టిగా చెప్పవచ్చు.
తాము పోటీ చేస్తున్న 16 స్థానాలలోనూ గెలిచి తీరుతామని కె. సి. ఆర్ చెబుతున్న మాట ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికో ఆయనకే తెలియాలి. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు పెట్టుకొని అనవసరంగా తన బలం బలగం ఎంతో పరీక్షించుకోడానికి కె. సి. ఆర్ చేసిన ఈ ప్రయత్నం వికటిస్తే మొత్తం తెలంగాణా ఉదయామం నీరుగారిపోతుంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రదాన పార్టీలను అనామక పార్టిలుగా కె. సి. ఆర్ పరిగణించినట్లు ఉంది. అధినేత బలవంతంగా తమపై రుద్దిన ఉపఎన్నికలతో ఏమీ పాలుపోని టి. ఆర్. ఎస్ నేతలు వీధిలేక పోటీకి సిద్దపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తెలంగాణాలో తాము అన్ని సీట్లు దక్కించుకుంటామని చెప్పడం లేదు తమ పార్టీకి 5 ఒర్ 6 సీట్లు వస్తాయని పోటీ గట్టిగా ఉందని అంటుంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా అదే బావనతో ఉంది.
తెలంగాణాలో బలమైన అభ్యర్థులనే ఆ రెండు పార్టీలు రంగంలో దించాయి. వాస్తవానికి తెలంగాణాలో టి. ఆర్. కు. పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఆ పార్టీకి గెలుపి అంత సునాయాసం కదు.అ పార్టీలో అసంతృప్తి బాగానే ఉంది. వర్గపోరు ఎక్క్వాగా కనిపిస్తుంది. ప్రస్తూం బరిలో ఉన్న 6 నుంచి 7 గురు అభ్యర్థు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నాలుగేళ్లలో టి. ఆర్. ఎస్. కు చెందిన ప్రజా ప్రతినిదులు వారి వారి నియోజక వర్గాలకు ఒరగపెట్టింది ఏమీలేదు. ఎంతసేపు ' పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి ' అన్నట్లు తేలగానా జపం తప్ప మరొకటి లేదు.
నాలుగేళ్లతో పోల్చుకుంటే తెలుగుదేశం తెలంగాణాలో కాస్త బలపడిండనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేక విదానలపై ఆ పార్టీ చేపట్టిన ఉధ్యమాలు మంచి ఫలితాలనే ఇచ్చినట్లు చెప్పవచ్చు. అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్న అధికార పార్టీకి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఓ పెద్ద వారం . ఆ పార్టీ చేపట్టిన అనేక పథకాలతో పాటు ఆరోగ్య శ్రీ పథకం చక్కటి ప్రజాదరణ పొందింది. ఇక టి. ఆర్. ఎస్. తరుపున బరిలోకి దిగిన అభ్యాఋుతుల పరిస్థితి మాత్రం ముందు నుయ్యి, వెనుక గొయ్యిల ఉంది తమపై అసంతృప్తి తో ఉన్న నాయకులు తమ పుట్టి ఎక్కడ ముంచుతారో అని వారు కలవర పడుతున్నారు.
పార్టీలోని కుమ్ములాతలను విబేధాలను పరిష్కరించడం లో విఫల మైన నాయకత్వం అభ్యర్థులతో అభిప్రాయ బేదాలున్న వాటిని పక్కన పెట్టి తెలంగాణవాదాన్ని గెలిపించాలని పిలుపు ఇచ్చింది. తెలంగాణా ప్రాంతం లో పోటీ చేసిన అన్ని సీట్లను గెల్చుకుంటే తెలంగాణా వాదనను బతికించే నట్లే దానికోసం గట్టి ప్రయత్నం చేయాలి. ఆది వదిలి ఖైరతబాద్ సీటు కూడా మాదే అని గొప్పలు చెప్పడం ఎందుకో అర్థం కాదు. ఈ ఉప ఎన్నికలు టి. ఆర్. ఎస్. కు జీవన్మరణ సమస్య ఐతేయ్ కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికలకు రిహర్స్‌ల్ వంటివి. తేలగానా పై ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోడానికి ఆ పార్టీలకు ఇది ఎంతో ఉపకరిస్తుందని చెప్పవచ్చు.


