| << Newer | Post Comments | Older >> |
.
యు. పి. ఏ. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ శనివారం మద్యాహ్నం కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీకి సంబందించిన రాష్ట్రాల ఇన్‌ఛార్జీలు, కార్యదర్శులతో నిర్వహించనున్న ఈ సమావేశంలో వివిద రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి గురించి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమీక్షించనున్నారు.
అణు ఒప్పందం విషయంలో యు. పి. ఏ. మిత్రపక్షమైన వామపక్షాలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ఒకవేళ ఏ కారణంగా నైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని గురించి తెలుసుకొని దానికనుగుణంగా వ్యూహాన్ని రూపొందించుకోవాలని సోనియా యోచిస్తున్నారు. అణు ఒప్పందం జరిగి తీరాలని ప్రధాని మన్మోహన్ పట్టుదలతో ఉన్నారు. జి-8 సదస్సుకు హాజరయ్యే లోగా అణు ఒప్పందం పై ఒక నిర్ణయం జరగాలని ప్రధాని అంటున్నారు. అణు ఒప్పందానికి ససేమిరా అంటున్న వామపక్షాలు తమ మాటను కాదని అడుగు ముందుకేస్తే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని చెబుతున్నాయి. ప్రదాని, సోనియాలు మాత్రం అణు ఒప్పందానికి సానుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యం లో వివిద రాష్ట్రాల్లో పార్టి పరిస్థితి ఏమిటి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల వద్ద , కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రాలలోని పార్టీ ల పరిస్థితి ఎలా ఉంది, లోక్‌సభతో పాటు, గడువు సమీపిస్తున్న రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలకు వెళ్ళలా, లేదా వాటికీ గడువు పూర్తి అయిన తరువాత ఎన్నికలకు వెళ్ళడం మంచిదా అన్న విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్నా దానిపై తన బాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ తెలుసుకోనుంది. ఒక పక్క ద్రవ్యోల్భణం, మరోపక్క అధిక ధరలు దేశాన్ని కుంగ దీస్తున్న తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం మంచిది కాదని యు. పి. ఏ. లోని మిత్రపక్ష పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ కు సూచించాయి. ముందస్తుకు తాము సిద్దంగా లేమని బాగస్వామ్య పార్టీలు చెబుతున్నాయి. వామపక్షల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ బావిస్తోంది. సొంత పార్టీలోకుడా ముందస్తు కు విముకత వ్యక్తం అవుతోంది. ఇవన్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు పై మరింత లోతుగా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ బావించింది. అణు ఒప్పందం పై వామపక్షాలు తమ వైఖరిని మార్చుకోకుండా మొండిగా వ్యవహరిస్తే ఎం చేయాలి? వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటే మిగిలిన పార్టీల మద్దతు కూడా గట్టి ప్రభుత్వాన్ని కొనసాగించాలా? లేని పక్షంలో ముందస్తుకు ముందడుగు వేయెల అన్న దానిపై కూడా శనివారం మద్యాహ్నం12. 30 గంటలకు సోనియా నివాసంలో జరగనున్న సమావేశంలో చర్చించనుంది.


