| << Newer | Post Comments | Older >> |
ముందస్తు ఎన్నికల పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గడువు కన్నా ముందే దేశ వ్యాప్తంగా ఎన్నికలు రావచ్చునన్న ఉహాగానాలు సాగుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం తో ఆగ్రహించిన వామపక్షాలు అవసరమైతే కేంద్రం లో యు. పి. ఏ. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరిస్తామని హెచ్చరించడం తో ముందస్తు ఎన్నికల ఉహాగానాలకు బలం చేకూరిండి. వామపక్షాలు గతం లో కూడా ఇలాంటి బెదిరింపులకు దిగాయి. అయితే ఈ సారి తమావి వట్టి బెదిరింపులు కావని చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుతుందని ఆ పార్టీ ఆగ్రా నేతలు బావిస్తూన్నారు. మూడస్తు ఎన్నికల వల్ల బి. జె. పి. పార్టీకి లాభ ఉండవచ్చునని ఎన్. డి. ఏ కూటమి ఆశిస్తోంది. కేంద్రం లో యు. పి. ఏ. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడం ద్వారా ఆది ఎన్. డి. ఏ. కూటమికి లాభం చేకూరుతుందన్న అంశం పైనే ఇప్పటి దాకా వామ పక్షాలు మిన్న కుండి పోయాయి. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉన్నా మిగిలిన పార్టీలు మాత్రం సిద్దంగా లీవు. బి. జె. పి. కూడా ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదు. ఉత్తరడిన ఆ పార్టీ బలం తగ్గుతోంది. కర్ణాటకలో సాదించిన విజయం తో దశ్నదిలో తొలిసారిగా పదం మోపిన బి. జె. పి. కి ఆది అంత సంతో షన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఉత్తరదిలో పార్టీని పటిష్ట పరుచుకోలేక పోతే కేంద్రం అధికారాన్ని సాదించడం సాధ్యం కాదు. ఈ కారణంగా బి. జె. పి. ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదు. ద్రవ్యోల్భణం రాను రాను పెరిగి పోతుండటం తో కేంద్రంలోని యు. పి. ఏ. ప్రభుత్వం కలవరపడుతోంది. ధరల అదుపునకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన అవి ఫలించడం లేదు. ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పేరుదల ఈ ఏడాది అక్టోబర్ దాకా ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ వామపక్షాలు గనక కేంద్ర ప్రబుత్వానికి మద్దతు ఉపసంహరించిన పక్షం లో దానిని తనకు అనుకూలంగా మలచుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగని ఎదుర్కోడానికి రాష్ట్రం లో తెలుగు దేశం పార్టీ ఇప్పటి నుంచి సిద్దం అవుతోంది.


