| << Newer | Post Comments | Older >> |
అణు ఒప్పందం విషయం లో యు. పి. ఏ కు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి ముందస్తుకు సంకేతాలు ఇస్తున్న నే పథ్యం లో ఆదివారం సి. పి. ఎమ్.పొలిట్‌బ్యూరో డిల్లీలో సమావేశం కానుంది. ముందస్తు అనివార్యమైతే అనుసరించాల్సిన వ్యూహం గురించి పొలిట్ బ్యూరో చర్చించనుంది. పార్టీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ సమావేశం లో పాల్గొననున్నారు. అణు ఒప్పందం కన్నా దేశాన్ని పట్టి పీడుస్తున్న ద్రవ్యోల్భణం, అధిక ధరలు గురించి చర్చించడం అవసరమని సి. పి. ఎం. బావిస్తోంది. అయితే కాంగ్రెస్ వైఖరిలో మాత్రం మార్పు రాకపోవడం, అణు ఒప్పందనికే అధిక ప్రధాన్యతను ఇవ్వడం గమనిస్తే, ఒకవేళ సి. పి. ఎం. మద్దతు ఉపసంహరించుకున్న పర్వాలేదన్న ధోరణి కనిపిస్తోంది. ఇది ఒక రకంగా సి. పి. ఎం. ను రెచ్చగట్టడమే. ములాయం మద్దతును కూడా గట్టాలని కూడా కాంగ్రెస్ ప్రయతిస్తోంది. ములాయం కాంగ్రెస్ కు అండగా నిలిస్తే మాయావతి సి. పి. ఎం. వైపు వెళ్ళవచ్చు. ఇవన్ని గమనిస్తున్న సి. పి. ఎం. యు. పి. ఏ. విషయంలో అమీ తుమీ తేల్చుకోడానికి సిద్దం అవుతుంది. ఆదివారం జరగనున్న పొలిట్ బ్యూరో సమావేశం లో పార్టీ మరో సారి తన వైఖరిని స్పష్టం చేయవచ్చు. ఎన్ని కోణాల్లో ఆల్చించిన ముందస్తు ఎన్నికలు తప్పవని అనిపిస్తోంది.


