Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/9/18 8:12:02


'నేను మారాను, నాలో మార్పు వచ్చింది'. అని 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత టి. డి. పి. అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినా అప్పట్లో మరో దారి లేక బాబు విధానాలు నచ్చాక పోయిన పార్టీలో కొనసాగిన సీనియర్లు చిరు పార్టీ రావడం తో ఆ పార్టీలోకి వలసలు వెళుతున్నారు. పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని అనుమానం వచ్చిన వారంతా చల్లగా జారుకుంటున్నారు. పార్టీని స్థాపించిన ఎన్. టి. ఆర్. విధానాలను ఆయన మరణానంతరం చంద్రబాబు ఆట కెక్కించారు. ఆది రుచించక పోయినా పార్టీ అధికారం లో ఉండటం తో అందరు తమ అసంతృప్తిని లోపలే దాచుకున్నారు. చంద్రబాబు తన విధానాల ద్వారా ప్రపంచ బ్యాంక్ ను మెప్పించగలిగరే కానీ పార్టీ లోని నాయకులను , మెప్పించలేక పోయారు. చంద్రబాబు తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినా ఆయన విధానాలను ప్రజలు ఆమోదించలేదు. ఫలితంగానే 2004 ఎన్నికల్లో పార్టీ చాలా ఘోరంగా ఓటమి పాలైంది. ఓటమి నుంచి గుణ పాఠం నేర్చుకున్న బాబు తన విధానాలను మార్చుకోడానికి , తప్పులు దిద్దు కోదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. టి. రామారావు వేసిన ముద్ర, ఆయన విధానాలను ఇప్పటికీ ప్రజల్లో ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. అవి ఎంతటి ప్రభావం చూపుతోందంటే బుదవారం జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా టి. డి. పి. కార్యాలయం లో జరిగిన కార్యక్రమానికి హాజరైన తెలంగాణా సాయుద పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ ఎన్. టి. ఆర్. విధానాలు మరిచి పోవద్దని సూతి మెత్తగా చంద్రబాబును హెచ్చరించడం విశేషం. ఆయన విధానాలను అనుసరించడం తప్పనిసరి అని ఆమె చెబుతూ ఎన్. టి. ఆర్. స్థాపించిన పార్టీ అయిన కారణంగానే తాను సన్మానానికి అంగీకరించానని చెప్పడం చూస్తే నందమూరి తారక రామారావు విధానాలు ఎంతటి బలమైన ముద్ర వేశాయో అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రవేశ పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం, పక్క ఇళ్ళు, ఈనాటికీ ఇతర రాజకీయ పార్టీలు మరో రూపంలో అమలు చేస్తున్నాయి. కూడు, గూడు, గుడ్డ అన్న ఎన్. టి. ఆర్. విధానం ప్రజల పై చెరగని ముద్ర వేశాయి. మధ్య పాన నిషేదాన్ని రామ రావు ఖచ్చితంగా అమలు పరిచి అందరిని ఆకట్టు కున్నారు. ఆయన విధానాలు నచ్చి వామపక్షాలు ఆయనతో జత కట్టాయి. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని అస్త్రంగా చేసుకొని ఆయన 1983 లో జరిపిన రాజకీయ పోరాటం లో అప్పటి అధికార పార్టీని చిత్తుగా ఓడించి జయ కేతనాన్ని ఎగురవేశారు. తాను నమ్మిన విధానాన్ని తూ. చ. తప్పక అమలు పరిచి ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. మద్య నిషేదం వల్ల ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతుందని అధికార యంత్రాంగం చెప్పినా రామారావు వైఖరిలో మార్పు రాలేదు. తాను ప్రజల కిచ్చిన హామీని అమలు చేసి మాట దక్కించుకున్నారు. ఎన్నో విధానాలను ఎన్. టి. ఆర్. అమలు పరిచారు. ఆయనను పదవిలోనుంచి దింపి అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఎన్. టి. ఆర్. మరణం తరువాత ఆయన విధానాలను ఆట కెక్కించి వాటికే కాస్త పేరు మార్చి తన సొంత విధానలాగా ప్రచారం చేసుకోడానికి సిద్ద పడిన ఫలితం లేకుండా పోయింది. చివరికి ఇపుడు ఎన్. టి. ఆర్. ఆదర్శలను అమలు చేస్తామని విధి లేక చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికీ ఎన్. టి. ఆర్. బొమ్మ లేకుండా బాబు ముందుకు సాగలేరు. అందుకేనేమో ఎన్. టి. ఆర్. చూపిన బాటలో నడుస్తామని బాబు చెప్పారు. ఆయన లో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. ప్రజల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న ఎన్. టి. ఆర్. విధానాల అమలే టి. డి. పి. కి శ్రీరామరక్ష.! కాదంటారా బాబు గారు!!





Related Stories:

  • బావకు బాసటగా బాలయ్య
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • భుజాలు తడుముకుంటున్నారు..
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఉప ఎన్నికల ప్రచారం లో బాబు
  • బ్రోకర్లు గా మారుతున్న కథానాయికల మేనేజర్
  • అహమ్మదాబాద్ కు వెళ్లనున్న సోనియా, మన్మోహķ
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • అగ్ని ప్రమాదం
  • రైతు ప్రేమికుని గా మారిన చంద్ర బాబు...
  • డిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • అహమ్మదాబాద్ పేలుళ్ల లో 52 కు చేరిన మృతుల సంఖ&
  • తృతీయ కూటమి పై చర్చలు
  • బాబు- వరుణుడు లకు పడాధా..?
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • కె.సి. ఆర్. బస్సు యాత్ర 22 నుంచి
  • యాత్రల జాబితాలోకి మరో పార్టీ
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |