| << Newer | Older >> |
on 2008/7/14 19:23:23
ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి, బహుజన సమాజ్ పార్టీ అదినెత్రి మాయావతి ని మరో కొత్త పదవి వరించనుంది. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మాయావతి కాంగ్రెస్‌పార్టీ నేతృత్వం లోని యు. పి. ఏ. ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి తగిన అవకాశంకోసం చూడ సాగారు. కాంగ్రెస్ తో చేయి కలపాలని సమాజ్‌వాదీ పార్టీ కి వచ్చిన ఆలోచన తెలుసుకున్న మాయావతి కేంద్రంలోని యు. పి. ఏ. కూటమి ప్రభుత్వానికి తమ పార్టీ ఎం. పి. లు 17 మంది మద్దత్తును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత అణు ఒప్పందం విషయం లో వామపక్షాలు యు. పి. ఏ. ప్రభుత్వం తో విభేదించాయి. చివరికి వామపక్షాలు కూడా యు. పి. ఏ. ప్రభుత్వానికి మద్దత్తును ఉపసంహరించాయి. యు. పి. ఏ. కు సమాజ్‌వాదీ అండగా నిలవడానికి ముందుకు రావడం, యు. ఎన్. పి. ఏ. కన్వీనర్ తో మాయా జరిపిన చర్చల ఫలితంగా మాయావతి ని యు. ఎన్. పి. ఏ. ఛైర్‌పర్సన్ గా ఎన్నుకునే విషయం పై చంద్రబాబు యు. ఎస్. పి. ఏ. భాగస్వామ్య పార్టీలతో చర్చించ నున్నారు. ములాయం సింగ్ స్థానంలో ఆమెను కూర్చో పెట్టడం వల్ల చంద్రబాబుకు రెండు లాభాలున్నాయి. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పడం తో పాటు రాష్ట్రంలో బి. ఎస్. పి. తో సీట్ల సర్దుబాటు చేసుకోడానికి వీలు కలుగుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాబోయే ప్రధానిగా మాయావతి ని బి. ఎస్. పి. నేతలు కార్యకర్తలు ప్రకటించుకోడానికి వీలు కలుగుతుంది. మాయావతి ని యు. ఎన్. పి. ఏ. ఛైర్‌పర్సన్ గా నియమించే విషయం పై చంద్రబాబు వామపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకొనే వీలుంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



