| << Newer | Older >> |
on 2008/6/19 5:55:34
రానున్న ఎన్నికల్లో తిరిగి తామే ఛాంపియన్స్ అని రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి గురువారం డిల్లీ లో అన్నారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు ఎలాంటి నష్టం వాటిల్ల దన్న ధీమాను వై. ఎస్. వ్యక్తం చేశారు. గత 17 ఏళ్లుగా రాష్ట్రం లో కాంగ్రెస్ కు పోటీదారుగా ఉన్న టి. డి. పి. తమకు ప్రదాన ప్రత్యర్థి పోటీదారు అని వై. ఎస్. చెప్పారు. రాష్ట్రం లో అయితే కాంగ్రెస్ కాదంటే తెలుగుదేశం పార్టీ కి మాత్రమే అధికారం దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నేత తెలిపారు. ప్రభుత్వం పై వ్యతిరేకత పెద్దగా లేదని, కాబట్టి తమ పార్టీ రానున్న ఎన్నికల్లో 230 అసెంబ్లీ,36 పార్లమెంట్ సీట్లు రాష్ట్రం లో తప్పక సా దిస్తామని మని వై. ఎస్. బల్ల గుద్ది మరి చెప్పారు. చిరంజీవి రాజకీయ పార్టీని పెట్టినా ఆ పార్టీ ప్రభావం తమ పార్టీ పై ఉండదని వై. ఎస్. అన్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




