| << Newer | Older >> |
on 2008/5/8 8:05:09
తోటి క్రికెటర్ శ్రీశాంత్ పై చేయి చేసుకోవడం అతఃని చెంప చెళ్ళు మనిపించడం తప్పే నని ఈ ఒక్క సారికి తనను మన్నించాలని క్రికెటర్ హర్బజన్ సింగ్ చేస్తున్న విజ్ఞప్తిని అటు ఐ. పి. ఎల్. గాని ఇటు బి. సి. సి. ఐ గాని మాన్నిచే అవకాశాలు కనిపించడం లేదు. బజ్జీని రక్షించడానికి ఒక వర్గం అతన్ని వెనుకేసూకరావడేమే కాకుండా బి. సి. సి. ఐ పై ఒత్తిడి తీసుకురావడానికి పావులను కదుపు తోంది. ఆ వర్గం సూచనల మేరకే బజ్జీ తన తప్పు ఒప్పుకొంటూ బి. సి. సి. ఐ కి లేఖ రాసినట్లు సమాచారం. శ్రీశాంత్ ను బజ్జీ కావాలనే కొట్ట డ న్న వాదనకు రాను రాను బలం చేకూరుతోంది.
డ్రెసింగ్ రూమ్ లో జరిగిన ఈ గొడవ ను చూసిన వరిలీ విదేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఉన్నారని తెలిసింది. చెంప మీద కొట్టడంతో సరిపెట్టకుండా శ్రీశాంత్ పై ఆవేశంగా మరో సారి దాడికి బజ్జీ సిదం అవడం బజ్జీ పై ఎదురు దాడికి శ్రీశాంత్ కూడా రెడీ కావడం తో డ్రెసింగ్ రూమ్ లో ఉన్న మిగిలిన ఆటగాళ్లు వారిద్దరూ పరస్పరం ఘర్షణకు దిగకుండా నివారించ గలిగారని తెలిసింది. బజ్జీ , శ్రీశాంత్ మద్య జరిగిన వ్యాహారాన్ని ఒక టి. వి. ఛానెల్ చిత్రీకరించడం అప్పట్లో ఎవరికి తెలియదు. చెంపడెబ్బ తరువాత వారి ఇద్దరి మద్య ముష్టి యుద్దం కూడా జరిగిందని, ఇద్దరుకలహించుకోడాన్ని చూసిన్ సెక్యూరిటీ గార్డులు వారి మద్య తిరిగి గొడవ జరకుండా అడ్డుకున్న రాణి సమాచారం. శ్రీశాంత్ పై చేయి చేసుకున్న బజ్జీ పై పది ఐ. పి. ఎల్. మ్యాచ్‌లు ఆడకుండా నిషేదం విడించడం తో పాటు మూడు కోట్ల రూపాయలను జరిమానంగా విడించారు. శ్రీశాంత్ ను చెంపడెబ్బ కొట్టడంతో సరిపెట్టుకోలేని బజ్జీ తరువాత శ్రీశాంత్ నిందిస్తూ అతని పైకి లాంఘించాడని తెలిసింది.
బజ్జీ పై దాడికి శ్రీశాంత్ కూడా సిద్దపడినా పంజాబ్ జాటర్టు అతన్ని అదుపు చేసిందని సమాచారం. ఈ వ్యవహారం పై సమగ్ర విచారం కోసం సుధీర్ నానావతి విచారణ కమిషనర్ గా నియమితులయ్యారు. నానావతి కూడా బజ్జీ కి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వవచ్చునని సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన బజ్జీ తన పై దయ చూపాలనీమన్నిస్తుందా? లేదా అతని విషయం లో మరింత కఠినంగా వ్యవహరిస్తుందా అన్నది వేచి చూడాలి. నానావతి నివేదిక అందిన తరువాత బోర్డు బజ్జీ విష్యం పై ఒక నిర్ణయానికి రావచ్చు. ఒక వేల నానావతి కమిషన్ కూడా బజ్జీ పై చర్యకు సిఫార్స్ చేస్తే బజ్జీ పై మరిన్ని మ్యాచ్‌ల నిషేదాన్ని విడించ వచ్చు దానితో పాటు బజ్జీ మ్యాచ్ ఫీజ్ లో భారీ కోత విడించ డానికి ఆస్కారం ఉంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



