| << Newer | Older >> |
on 2008/6/18 8:30:27
వరికి మద్దతు ధరను పెంచాలని రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి బుదవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కూ విజ్ఞప్తి చేశారు. వరికి కనీసం 1000 రూపాయలను మద్దతు ధారగా నిర్ణయించాలని కోరారు. ప్రస్తుతం కేంద్రం వరికి 850 రూపాయలను మద్దతు ధారగా ప్రకటించింది. అయితే దానిపై రాష్ట్రంలోని విపక్షం అసంతృప్తి చెందడమే కాకుండా ఆందోళనకు దిగింది. వరికి మద్దతు ధరను 1000 రూపాయలుగా నిర్ణయించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ ను వై. ఎస్. కేంద్ర మంత్రి కి వివరించారు. రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే బియ్యం కోటాను కూడా పెంచాలని కోరారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




