| << Newer | Older >> |
on 2008/6/25 11:37:59
తెలంగాణా విషయం లో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఎటు తేల్చుకోలేక సత మత మైన దేవేందర్‌గౌడ్ ఆ పార్టీ నుంచి బైటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేయడానికి సిద్దం అవుతున్నారు. తన మద్దతు దారుల తోనూ, శ్రెయోబీలాషులతోనూ ఆయన మంతనాలను జరుపుతూ బిజీ,బిజీగా ఉన్నారు. దేవేందర్ గౌడ్ కు మద్దతు తెలపడానికి తెలంగాణా ప్రాంతంలోని వివిద ప్రాంతాల నుంచి ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో దేవేందర్ గౌడ్ ఇంటికి వస్తున్నారు. ఆయన ఇంటివద్ద చాలా కోలా హాలంగా ఉంది. ఉధ్యమాన్ని బలపరచడం లో కె. సి. ఆర్. విఫలమయ్యారని తెలంగాణా రాష్ట్ర సమితి కి చెందిన ప్రకాష్ అన్నారు. ఆ కారణంగానే తాను టి. ఆర్. ఎస్. నుంచి బైటకు వచ్చి దేవేందర్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. గౌడ్ పెట్టనున్న కొత్త పార్టీలో టి. ఆర్. ఎస్., తెలుగుదేశం పార్టీలనుంచి పెద్ద సంఖ్యలో ఆయా పార్టీల కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు చేర వచ్చునని సమాచారం. టి. ఆర్. ఎస్. , తెలుగుదేశం పార్టీలు ఈ విషయం లో కలవర పడుతున్నాయి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




