| << Newer | Older >> |
on 2008/9/24 7:02:07
నల్గొండ జిల్లాలోని భువనగిరి లోక్‌సభ సీటుకు డిమాండ్ పెరుగుతోంది. నియోజక వర్గాల పునర్విభజన కారణంగా భువనగిరి లోక్‌సభ నియోజక వర్గంగా అవతరించింది. అక్కడి నుంచి రానున్న ఎన్నికల్లో పోటీచేయడానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయ చైతన్యం బాగా ఉన్న నల్లగొండ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవరం నుంచి పోటీ చేయడానికి అన్ని పార్టీల నేతలు ఉవిళ్ళూరుతున్నారు. వామపక్ష పార్టీల విషయం చెప్పనక్కరలేదు.
రాష్ట్ర రాజదానికి భువనగిరి దెగ్గరలో ఉంది. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని తల్లి తెలంగాణా పార్టీ అధినేత్రి విజయశాంతి తహ తహ లాడుతున్నారు. దానికిగాను ఆమె ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల కె. సి. ఆర్. తో జరిపిన చర్చల్లో తెలంగాణాకోసం కలిసి పనిచేయాలని ఇద్దరు ఒక అవగాహనకు వచ్చారు. తల్లి తెలంగాణా పార్టీని టి. ఆర్. ఎస్. లో విలీనం చేయాలని కె. సి. ఆర్. ప్రతిపాదించినా విజయశాంతి దానిపై తన నిర్ణయాన్ని ఇప్పటికి చెప్పలేదు. అయితే తాను భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె కె. సి. ఆర్. కు చెప్పారు. దానిపై ఆయన కూడా ఇంకా ఏమీ చెప్పలేదు. భువనగిరి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని దేవేందర్‌గౌడ్, గుత్తా, నోముల కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



