| << Newer | Older >> |
on 2008/6/9 5:32:17
రాష్ట్రం లో ప్రస్తుతం అతి బలహీన మైన పార్టీగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని సంత రింప చేయడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం దారులను అన్వేషిస్తోంది. గతం లో తెలుగుదేశం పార్టీతోఆంటకాగడం వల్ల వాటిల్లిన నష్టం నుంచి ఇప్పటికీ ఆ పార్టీ కోలుకోలేకపోతుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బాగా దెబ్బ తిండి. ప్రస్తుత రాష్ట్ర నాయకత్వ పని తీరుపై అసంతృప్తి తో ఉన్న జాతీయ నాయకత్వం రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికీ రాష్ట్రం లో పార్టీని బలోపేతం చేయడానికి వీలుగా ప్రజాదరణ, జనకర్షన కలిగిన మెగాస్టార్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించి ఆయనను ముఖ్య మంత్రి అభ్యర్తిగా ప్రకటించి రాష్ట్రం లో అధికారాన్ని దక్కించుకోవాలని ఆలోచిస్తోంది. రాజకీయ అరంగ్రేటం చేయాలని చిరంజీవి నిర్ణయించుకోవడం , సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి ఆయనతో మంతనాలు జరపడానికి పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడును రంగం లోకి దింపి నట్లు తెలిసింది. వెంకయ్య నాయుడు కూడా చిరంజీవితో మాట్లడారని ఆయనను పార్టీలోకి ఆహ్వానించారని వినికిడి. చిరంజీవి తమ పార్టీలోకి చేరితే తమ పార్టీ ముఖ్య మంత్రి అభ్యర్థి గా చిరంజీవి పేరును ప్రకటిస్తామని కూడా వెంకయ్య నాయుడు ఆయనకు వాగ్దానం చేశారని తెలిసింది. వెంకయ్య నాయుడు ఆహ్వనాన్ని చిరంజీవి మన్నిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




