| << Newer | Older >> |
on 2008/10/3 8:21:38
బెల్ట్ షాప్‌ల పై ఉద్యమాలు నిర్వహిస్తున్న రోజా, తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తొలగిస్తామని టి. డి. పి. అధినేత చంద్రబాబు వాగ్దానం చేశారు. వారికన్నా ఒక అడుగు ముందుకేసిన ముఖ్యమంత్రి వై. ఎస్. రాష్ట్రం లో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపులను వారం రోజుల్లో తొలగించాలని అధికారులను ఆదేశించి టి. డి. పి. నోటికి తాళం వేశారు. రాష్ట్రం లోని బెల్ట్ షాపుల పై నెల రోజుల్లో ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని అదికారులను ఆదేశించారు. కళ్ళు గీత కార్మికుల పొట్ట కూడుతున్న బెల్ట్ షాపుల నిర్వాహకుల పై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొసైటీల ద్వారా కళ్ళు గీత కార్మికులు తీసుకున్న రుణాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానివల్ల కళ్ళు గీత కార్మికులకు దాదాపు8. 50 కోట్ల రూపాయల వెసులుబాటు కలుగుతుంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



