| << Newer | Older >> |
on 2008/6/13 1:53:44
.బలోపేతానికి చర్యలు
తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆ పార్టీ అధినేత కె. సి. ఆర్. పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న కె. సి. ఆర్. పార్టీ కార్యకర్తల్లో జవ సత్వాలు నింపి రానున్న ఎన్నికలకు సన్నద్దం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ఓటమి పై విశ్లేషణలు జరిపారు. మేధావుల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఫలితాలు చూసి భయపడవద్దని నేతలకు, కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటుపొడిచిన, పార్టీకి ద్రోహం చేసిన వారిని గుర్తించడం పూర్తి చేసి వారి పై కఠిన చర్యలు తీసుకోడానికి నిర్ణయించారు. అదే విషయాన్ని ప్రకటించడం విశేషం. పార్టీ కి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలోను విడిచి పెట్టడం కుదరదని స్పష్టం చేశారు ఈ సారి బి. సి. లను నిర్లక్ష్యం చేయడం జరగదని చెబు తున్నారు. ప్రతి నియోజకవర్గం లో నలుగురు, లేదా ఐదుగురి పేర్లను ప్రకటించి వారి పని తీరు పరిశీలించి అభ్యర్థిని ప్రకటిస్తామని కె. సి. ఆర్. అంటున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



