| << Newer | Older >> |
on 2008/9/30 12:22:36
రాజకీయాల్లో ఎత్తులు వేయడం లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. సి. ఆర్. కూడా నాలుగాకులు ఎక్కువే చదివి నట్లు ఆయన వేసిన ఎత్తుల ఫలితం చెబుతోంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాన్ని బాగా ప్రభావితం చేయనున్న తెలంగాణ అంశం చుట్టూ అన్ని రాజకీయ పార్టీలు చక్కర్లు కొడుతున్న విషయాన్ని పసిగట్టిన కె. సి. ఆర్. తెలంగాణకు ముందుగా ఎవరు సై అంటే వారితో కలవడానికి వారికి జై అంటామని ప్రకటించి అన్ని పార్టీలతో మ్యూజికల్ ఛైర్ ఆట ఆడించారు. ఆ ఆటలో తెలుగుదేశం పార్టీ నెగ్గినట్లే నని రెండు పార్టీల నేతల ఆమధ్య జరిగిన చర్చల సారాంశం చెప్పకుండానే చెబుతోంది. తెలంగాణ అంశం కోసం వేసిన కోర్ కమిటీ సమావేశాలు ముగిశాయి. కమిటీ తన నివేదికను సమర్పించడమే మిగిలింది. తెలంగాణకు అనుకూలంగా కమిటీ నిర్ణయం తీసుకునట్లు సమాచారం తెలుసుకున్న కె. సి. ఆర్. ఇక టి. డి. పి. తో పొత్తులకు తన పార్టీవారిని ఒప్పించడానికి రంగం సిద్దం చేసుకోనున్నారు. ప్రజారాజ్యం, టి. ఆర్. ఎస్. ల మద్య సయోధ్య కుదర్చడానికి సి. పి. ఐ. రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎంతగా ప్రయత్నం చేసిన ప్రజారాజ్యం నుంచి స్పష్టమైన హామీ మాత్రం రాలేదు. ఇదంతా గమనిస్తున్న చంద్రబాబు ఇక ఏ మాత్రం జాగు చేయకుండా తెలంగాణ పి అనుకూల నిర్నౌయాం తీసుకోవాలని నిర్ణయించుకొని అదే విషయాన్ని నెమ్మదిగా కె. సి. ఆర్. చెవిన పడేలా చేశారు. మరో పక్క నారాయణ దూకుడుకు కళ్ళెం వేయాలని నిర్ణయించుకున్న బాబు సి. పి. ఐ. జాతీయ నేత బర్దన్ తో మంతనాలు జరిపి నారాయణకు చెక్ పేటించారని సమాచారం. బాబు తో కలిసి పనిచయడమన్న, టి. డి. పి.పొత్తు అన్న పొద గిట్తక పోయిన తమ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్ళాడంసాధ్యం కాదు దాంతో నారాయణ కక్కలేక మింగలేక ఉన్నారు. పి. ఆర్. పి. కన్నా టి. డి. పి. కె తెలంగాణాలో క్యాడార్ ఉంది, బలం కూడా ఉంది. పార్టీ ల మధ్య పొత్తుల్లో క్యాడార్, బలం ప్రధాన పాత్ర పోషిస్తాయి. తెలంగాణాలో పి. ఆర్. పి. కి బలం తక్కువేనని చెప్పాలి. పునాది లేని ప్రజారాజ్యం కన్నా ఇప్పటికీ ఇంకా బలంగానే ఉన్న టి. డి. పి. తో పొత్తు పెట్టుకోవడమే మంచిదని కె. సి. ఆర్. నమ్ముతున్నట్లు ఉంది. టి. డి. పి. , టి. ఆర్. ఎస్. కలవడంతో పాటు వామపక్షాలు కూడా కలిసి వస్తే తెలంగాణాలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలి నష్టా పోతుంది. దాన్ని పుడ్చుకోవాలంటే రాయల సీమ , కోస్తా ఆంద్ర లో సీట్లు ఓట్లు పెంచుకోవాలి. అక్కడ పి. ఆర్. పి గనక ప్రబావని చూపితే కాంగ్రెస్ కోలుకోలేనంత దెబ్బ తినడం ఖాయమనిపిస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



