| << Newer | Older >> |
on 2008/6/9 5:05:57
రాష్ట్ర శాసన సభకు మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగ నున్నాయి. గతం లో కన్నా ఎక్కువ సీట్లను సాదించి తన నాయకత్వానికి తిరుగులెదని నిరూపించుకోడానికి పార్టీ పై తనకున్న పట్టు ఎంత గట్టి దో స్వపక్షం తో పాటు విపక్షం లోని తన ప్రత్యర్థులకు తెలియ చెప్పడానికి వై. ఎస్. అప్పుడే తన వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. దానిలో బంగంగా పార్టీనాయకులను, ప్రభుత్వంలోని అధికారులను పరుగులు పెట్టించడం ప్రారంభించనున్నారు. ఆరునెలల గడువు ఉంది కదా అని ఉపేక్షించకుండా తాను అనుకున్నా లక్ష్యాలను సాదించడానికి నిరంతరం తాను శ్రమిస్తూ మిగిలిన వారికి ప్రేరణ ఇస్తున్నారు. ప్రభుత్వాధి నేత అయిన వై. ఎస్. పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలపై కూడా కసరత్తు ప్రారంబించారు. కేంద్రంలోనూ , రాష్ట్రం లోను చేపడుతున్న అభివృద్ది పై ప్రజలకు వివరించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ముఖ్య మంత్రి నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ గురించి గ్రామీణ రైతాంగానికి తెలిసి వచ్చేలా గ్రామ గ్రామాన పార్టీ కార్యకర్తలు ప్రచారం చేయాలని పిలుపు ఇవ్వాలని సి. ఎం. బావిస్తున్నారు. తన అభివృద్ది మంత్రం ఉపఎన్నికల్లో బాగా పనిచేయడం తో సాధారణ ఎన్నికల్లో తిరిగి అదే మంత్రి మరింత పెద్ద ఎత్తున జపీంచనున్నారు. సాధారణ ఎన్నికల నాటికీ వీలైనన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రైతాంగాన్ని అక్కట్టుకోవాలని వై. ఎస్. ఆలోచిస్తున్నారు. రెందూరుపాయలకు కిలో బియ్యం, రైతులకు రుణ మాఫీ, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ గృహాలు తదితర సంక్షేమ పథకాల అమలు గురించి రానున్న ఎన్నికల్లో భారీగా ప్రచారాన్ని నిర్వహించడానికి కార్యకర్తల సేవలను విరివిగా వాడుకోవడానికి వై. ఎస్. రంగం సిద్దం చేసుకుంటున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల ఫలాలు నిర్ధిష్ట లబ్దిదారులకు చేరడానికి తుది గడువును డిసెంబర్ గా నిర్ణయించారు. అదే విషయాన్ని వివిద ప్రభుత్వ శాఖల అధిపతులకు మంత్రులకు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రానున్న ఎన్నికల్లో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోడానికి అనువుగా వై. ఎస్. తగిన వ్యూహాలతో తన రాజకీయ ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేయనున్నారు
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



