| << Newer | Older >> |
on 2008/10/4 10:46:13
తెలంగాణా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రతి తెలంగాణా ప్రజకి వివరించడానికి ప్రజా గాయకుడు గద్దర్ వినూత్న తరహాలో ఒక కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. తెలంగాణా వాదాన్ని ప్రజల్లో వినిపించడానికి 'ప్రజల వద్దకే కళాకారులు' పేరిట వంద కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట ల్లో పాదయాత్ర నిర్వహించి ప్రతి ఇంటి గడప తొక్కి తెలంగాణా ఎవరి కోసం , ఏడుకోసం అన్న విషయాన్ని అర్థం అయ్యేలా వివరించడానికి గద్దర్ నిర్ణయించుకున్నారు. తెలంగాణా సాధన కోసం అవసరమైతే తెలంగాణా ప్రాంతం లోని ప్రతి వ్యక్తి కాలికి మొక్కి తెలంగాణా కోసం ఉద్యమించాలని విజ్ఞప్తి చేయాలని ఆయన ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాదించుకోవడం సాద్యమని చెబుతున్న గద్దర్ పొత్తులు, ఓట్లు అంటూ అందరి చుట్టూ తిరగడం మాని తెలంగాణా వాదులతో కలిసి పోరాడాలని సూచిస్తున్నారు. తెలంగాణా అంశం పై మొసలి కన్నీరు కారుస్తూ సానుభూతి చూపుతున్న వై. ఎస్., చంద్రబాబు, చిరంజీవి లు తెలంగాణా ప్రజల కన్నీరు తుడవడానికి మాత్రం ముందుకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. సానుభూతి చూపి తెలంగాణా ప్రజల నుంచి ఓట్లు కొల్ల గొట్టాలనుకున్న వారికి రానున్న ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు బుద్ది చెప్పాలని గద్దర్ కోరుతున్నారు. తెలంగాణా వాదులంత ఏకమై ఉద్య మిస్తే ప్రత్యేక తెలంగాణా వచ్చి తీరుతుందన్న ఆశబావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



