| << Newer | Older >> |
on 2008/7/24 23:32:14
అణు ఒప్పందంవల్ల దేశానికి వన గురే ప్రయోజనాలను గురించి ప్రజలకు వివరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అణు ఒప్పందం వల్ల దేశానికి వాటిల్లే నష్టం గురించి వామపక్షాలు ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవడం తో దానికి ప్రతిగా అణు వల్ల చేకూరే ప్రయోజనాలను ప్రజలకు వివరించి వారికి అణు పై అవగాహన కల్పించడానికి గాను గ్రామ స్థాయి నుంచి ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం బావించింది. దానికి గాను ప్రచార భధ్యతలను వీరప్ప మొయిలీకి అప్పగించింది. దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని చేపట్టడానికి ఆయా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ స్థాయి నుంచి ప్రచారం చేపట్టనున్నారు. దానికిగాను సభలు సమావేశాలు నిర్వహించ నున్నారు. సదస్సులు కూడా చేపట్టనున్నారు. విపక్షలాప్రచారాన్ని తిప్పి కొట్ట డానికి అదే సరైన మార్గమని కాంగ్రెస్ బావిస్తోంది. పనిలో పనిగా కాంగ్రెస్ అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలౌ గురించి కూడా ప్రజలకు వివరించ నున్నాయి. అణు పై అధికార . విపక్ష ల మధ్య ప్రచార యుద్దం మొదలు కానుంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



