| << Newer | Post Comments | Older >> |

రాష్ట్రంలో ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలన్న అంశం పై వామపక్ష పార్టీలు సోమవారం అధికారిక ప్రకటన జారీ కానుంది. లెఫ్ట్ పార్టీలు సోమవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించనుంది. హైదరాబాద్ లోని మగ్దూమ్ భవన్ లో సి. పి. ఐ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశం లో పొత్తులపై చర్చ జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే సి. పి. ఎం పార్టీ తెలుగుదేశం పార్టీ తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లెఫ్ట్ పార్టీ ల మద్య ఐక్యత దెబ్బ తినకూడదన్న ఉద్దేశం తో రెండు పార్టీలు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ తో కలిసి ముందుకు వెళ్ళడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చాయి. సోమవారం అధికారిక ప్రకటన తో ఇక వామపక్ష పార్టీలు, టి. డి. పి. చెట్టా పట్టా లు వేసుకొని ముందుకు సాగుతాయి.


