Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/10/11 8:58:06

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఒండించాలన్న విషయంలో వామపక్ష పార్టీలు ఒకే మాటపై ఉన్నా, రాష్ట్రం లో కాంగ్రసేతర పార్టీలతో పొత్తుల విషయం లో మాత్రం చాలా బి న్నంగా ఆలోచిస్తున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వం పై సాగిస్తున్న పోరాటాల్లో కలిసి పనిచేస్తున్న సి. పి. ఐ., సి. పి. ఎం. పార్టీల్లో కొన్ని విషయాల్లో అభిప్రాయబేధాలు ఉన్నాయన్నది పలు సందర్భాల్లో వాటి మాటల్లో వ్యక్తం అయ్యాయి. తమని ఎదగనీయకుండా సి. పి. ఎం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం తో సి. పి. ఐ. ఉన్నట్లు కనిపిస్తోంది. రాను రాను తెలుగుదేశం పార్టీ బలహీన పడుతోందని, పైగా ఆ పార్టీకి ప్రజాదరణ తగ్గుతున్న నేపథ్యం లో టి. డి. పి. తో జత కట్టడం వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదని కూడా సి. పి. ఐ. గట్టిగా నమ్ముతోంది. తమ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సి ఉన్నా వాస్తవ పరిస్థితిని కమిటీకి వివరించి ఒప్పించాలని సి. పి. ఐ. రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. సి. పి. ఐ. రాష్ట్ర కమిటీ ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపుతోంది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సినీ నటుడు కావడం, ఆయనకు ఉన్న విశేష ఆదరణ, మచ్చ లేని వ్యక్తి గా ఉన్న చిరంజీవి తో పొత్తు అన్ని రకాలుగా మంచిదని సి. పి. ఐ. బావిస్తోంది. పైగా సి. పి. ఐ. కి తెలుగుదేశం పార్టీ తో కలిసి పనిచేయడం సుతారం ఇష్టం లేదు. అధికారం లో ఉన్నంత కాలం తమను దూరంగా ఉంచిన టి. డి. పి. పార్టీ తోజత కట్టడం తగదని కూడా ఆ పార్టీ గట్టిగా వాదిస్తోంది. ప్రజాసమస్యలు, భూపోరాటం, ఇతర ప్రజా సమస్యలపై సి. పి. ఎం .తో కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించి కలిసి పోరాడడానికి తాము సిద్దం అని చెబుతోంది. పొత్తుల విషయం లోమాత్రం పార్టీకి ఒక స్పష్టమైన విధానం తో వెళ్ళాలని అంటోంది. ఈ నెల చివరిలోగా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించే లోగా పి. ఆర్. పి. తో పొత్తుకు కేంద్ర కమిటీని ఒప్పించాలని సి. పి. ఐ. బావిస్తోంది. గత మూడు రోజులుగా సాగుతున్న పి. ఆర్. పి. ప్రజా అంకిత యాత్రకు లభిస్తున్న ప్రజాస్పందన గురించి కూడా సి. పి. ఐ. లోతుగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రం లో తెలుగుదేశం, కాంగ్రెస్, బి.జె.పి. లేని కూటమి కోసం ప్రయత్నించాలని పట్టుదలతో ఉంది. తమతో ఈ విషయం లో సి. పి. ఎం. కలిసి వస్తే సంతోషమని లేని పక్షం లో కేంద్ర కమిటీని ఒప్పించే ప్రయత్నం చేయాలని బావిస్తోంది. ఒకవేళ కేంద్ర కమిటీ తమ ప్రతిపాదనకు అంగీకరిచక పోతే కమిటీ నిర్ణయం మేరకు వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర కమిటీ మాత్రం జాతీయ స్టాయిలో టి. డి. పి. ని కలుపుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడాలని ఇప్పటికీ బావిస్తోంది. ఈ విషయం లో స్పష్టమైన నిర్ణయం వెల్లడి కావాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.





Related Stories:

  • అగ్ని ప్రమాదం
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • దేవేందర్ రాజకీయం
  • అమలు కాని వాగ్దానాలు
  • డీజి లో రామచంద్ర..!
  • ' జల్సా' వసూలు ఎంత ?
  • పెరుగుతున్న పులుల సంఖ్య
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • పులివెందుల్లో టెన్షన్-- టెన్షన్
  • సమిష్టిగా రాణించిన భారత్
  • వామ పక్షాల మధ్య విభేదాలు సమిసీనా !
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • 'పరుగుకు' సి. ఎం .క్లియరెన్స్
  • 'అణు' పై సందేహాలు నివృత్తి చేస్తాం: ప్రదాని
  • మరో మైలు రాయిని అదిగ మించిన సచిన్
  • పరిహారం పై పెదవి వి రుస్తున్న రైతాంగం
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |