| << Newer | Older >> |
on 2008/5/8 5:16:31
జంతు సంరక్షణ విషయం లో నల్లమల అటవీ అధికారులు చూపుతున్న ప్రత్యేక శ్రద్ద కారణంగా నల్లమల టైగర్ ప్రాజెక్ట్ జోన్ లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సమచరమ్.కదప, కర్నూల్, చిత్తూర్, ప్రకాశం, గుంటూర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3500 చదరపు కిలోమీటర్లు విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతం లో ఒక్కప్పుడు పెద్ద పులులు, చిరుత పులుల సంఖ్య బాగా ఉండేవి. అయితే వేటగాళ్ల పుణ్యమా అని వాటి సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. అంతరించి పోతున్న పులుల, చిరుతాలను సంరక్షించడానికి అటవీ శాఖ అధికారులు కొన్ని ప్రత్యేక మైన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా వాటి సంఖ్య పెరిగింది. శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ లోని రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 80 పెద్ద పులులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇక్కడ 1985 లో35, 2001 లో 57 పెద్ద పులులు ఉండేవని తెలిసింది. అలాగే చిరుత పులుల సంఖ్య ఇప్పుడు 100 కు పెరిగింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




