| << Newer | Older >> |
on 2008/9/21 5:30:07
ప్రజారాజ్యం పార్టీలో అందరు సెవకులె నని చిరంజీవి పదే పదే ప్రకటించడం చూస్తుంటే ఆయన తప్ప మిగిలిన వారంతా నేతలు కారన్న బావన కలుగుతోంది. తాను కూడా సేవకుడినే అని చిరు పలు సందర్భాల్లో చెప్పారు. చిరంజీవి పార్టీ లో ఇప్పటికే చేరిన ఇతర పార్టీల సీనియర్లను చిరంజీవి ముఖ్యులుగా బావిస్తూన్నారు. ఒక నిర్ణయాన్ని తీసుకోడానికి ముందు పార్టీలో చర్చించడం చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య పార్టీలో ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యత ఉందని అందరు నమ్ముతారు. అయితే పార్టీల అధినేతలు మాత్రం అవేవీ పాటించారు. పార్టీలో చర్చించకుండానే నిర్ణయాలను ప్రకటిస్తుండటం సర్వ సాదారణం. ప్రజారాజ్యం పార్టీ కూడా అదే మార్గం లో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం గురించి అన్ని పార్టీలు చెబుతుంటాయి. అవి మచ్చుకు కూడా కనిపించవు.
శనివారం సిరిసిల్ల పర్యటనకు వెళ్ళిన చిరంజీవి అక్కడ చేనేత కుటుంబాల వారితో మాట్లాడారు. వారి బాధలు తెలుసున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత బాధిత కుటుంబాల వారిని కలిసి వారిని ఓదార్చారు. తమ పార్టీ అధికారం లోకి వస్తే చేనేత కార్మికులను అన్నిరకాలుగా ఆదుకుంటామని చెప్పడం వరకు బాగుంది. అయితే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరుపున చేనేత వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తామని పోటీ చేయిస్తామని చెప్పడం పై పార్టీలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చేనేత కార్మిక సమస్యలను శాసన సభలో ప్రస్తావించడానికి వీలు కల్పిస్తామని చిరంజీవి చెప్పారు. చేనేత కార్మికుల కష్టాలను, సమస్యలను తెలుసుకోడానికి వెళ్ళిన చిరంజీవి వారు చెప్పినా విషయాలు విని చలించి పోయారు. ఒక దశలో కన్నీరు పెట్టుకున్నారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ పార్టీ తరుపున చేనేత వర్గానికి చెందిన వారికి పార్టీ టిక్కెట్ ఇస్తామని ముందుగానే ప్రకటించడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



