| << Newer | Older >> |
on 2008/9/19 20:12:58
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన కరీంనగర్ యాత్ర ద్వారా ఇతర పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చారు. వెనుకబడిన తెలంగాణా ప్రాంతాన్ని తన తొలి పర్యటనకు ఎంచుకోవడం లో వ్యూహాత్మకంగా వ్యవహరించారని కనిపిస్తోంది. పార్టీని ప్రకటించి మూడు వారాలు దాటిన ప్రజల్లో వెళ్ళడానికి సిద్ద పడని చిరంజీవి పార్టీపై పలు అనుమానాలు వ్యక్తం కావడం తో పాటు, ఆయన జనం లోకి వెళ్ళడానికి ఎందుకు సంకోచిస్తున్నారన్న దాని పై కూడా సందేహం వచ్చింది. అవన్నీ పట పంచలు చేయాలంటే యాత్రకు బయలు డెరక తప్పదన్న నిర్ణయానికి వచ్చిన చిరంజీవి హటత్తుగ కరీంనగర్ జిల్లా పర్యటనకు సిద్దం అయ్యారు. చిరంజీవి కరీం నగర్ జిల్లా పర్యటన లో చేనేత కార్మికుల ను పరామర్శించనున్నారు. శనివారం ఉదయం ఐదు గంటలకు ఆయన కొందరు ముఖ్యులతో సలహా దారులతో ప్రత్యేక వాహనం లో కరీం నగర్ కు బయలుదేరారు. ఆయన ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా లోని సిరిసిల్ల చేరుకోనున్నారు. కరీంనగర్ జిల్లా పర్యటన ద్వారా చిరు తన విమర్శకులకు సమాధానం ఇచ్చారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



