| << Newer | Older >> |
on 2008/9/21 6:33:46
ఎంత సేపు విలీనం గురించే మాట్లాడుతా రెందు కని తల్లి తెలంగాణా పార్టీ అధినేత్రి విజయశాంతి మీడియాను ప్రశ్నించారు. తెలంగాణా పార్టీలు, శక్తులు అన్ని కలిసి పనిచేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చామని దానిలో బాగంగా తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత తో కలిసి చర్చించామని అన్నారు. ఆయన తన పార్టీని టి. ఆర్. ఎస్. లో విలీనం చేయాలని సూచించారని, కలిసి పని చేస్తానని ఆయనతో తాను చెప్పానని విజయశాంతి పేర్కొన్నారు. కలిసి పనిచేయడం గురించి తాను చెబుతుంటే తల్లి తెలంగాణా పార్టీని టి. ఆర్. ఎస్. లో విలీనం చేస్తారా అని ఒక్క తన పార్టీనే ఎందు కడుగుతున్నారని విజయశాంతి కాస్త చిరాకు ప్రదర్శించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే టి. డి. పి. తో కలిసి పనిచేస్తారా! బి. జె. పి. లోకి తిరిగి వెళతారా! అని ప్రశ్నలు గుప్పించడం తో ఉన్నది ఒక్క విజయశాంతి ఎన్ని పార్టీలతో కలిసి పని చేస్తుందని, అన్ని ఒక్క తల్లి తెలంగాణా పార్టీనే ఎందు కడుగుతున్నారు అని అసహనాన్ని ప్రదర్శించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



