| << Newer | Older >> |
on 2008/6/16 6:55:25
కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం షోకాజ్ నోటిస్ జారీచేసినంత మాత్రానా ఆది పెద్ద శిక్ష కాదని పార్టీ సీనియర్ నేత, తెలంగాణా ప్రాంతీయాభివృద్ది బోర్డ్ ఛైర్మన్ ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అంటున్నారు ఆలేరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాజారస్ ఓటమికి ఉప్పునూతలే బాధ్యదం టూ పార్టీ అధిష్టానానికి అందిన ఫిర్యాదు మేరకు దానిని క్రమశిక్షణ కమిటీకి పంపి పరిశీలించాలని సూచించడం, ఆ తరువాత ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసి ఈ నెల 27 వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. తనకు ఇంకా నోటీసు అందలేదని ఆయన చెబుతున్నారు. అదే మాట పి. సి. సి. నేత కూడా అంటున్నారు. అయితే షోకాజ్ నోటిస్ ప్రతి ఒకటి పి. సి. సి. కి పంపినట్లు క్రమశిక్షణ కమిటీ డిల్లీలో చెప్పడం గమనార్హం. తెలంగాణా సెంటిమెంట్ గురించి తాను మాట్లాడెతే పార్టీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు కొందరు ప్రచారం చేయడం జరిగిందని ఉప్పునూతల అంటున్నారు. ఉప ఎన్నికలో లాజారస్ ఓటమికి తాను భాధ్యుడని ముఖ్య మంత్రి వర్గీయులు అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేయడం అన్యాయం అని ఉప్పునూతల వాపోతున్నారు.. తప్పు చేయని తనకు షోకాజ్ నోటిస్ ఇచ్చినంత మాత్రాన ఆది నేరం అయిపోదని నోటిస్ అందుకున్న తరువాత దానికి తగిన వివరణ ఇస్తానని ఆయన అంటున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




