| << Newer | Older >> |
on 2008/7/18 4:41:29
వియన్నాలో శుక్రవారం జరగనున్న ఐ. ఏ. ఈ. ఏ. సమావేశంలో భారత దేశ ప్రతినిదులు అణు ఒప్పందం పై వివరణ ఇవ్వనున్నారు. కేవలం భారతే దేశం కోసమే నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సమావేశంలో ఐ. ఏ. ఈ. ఏ. బోర్డ్ లోని 35 దేశాల సభ్యులు పాల్గొననున్నారు. న్యూక్ డిల్ పై బారత దేశ వివరణ విన్న తరువాత ఐ. ఏ. ఈ. ఎ.బొర్ద్ ఆగస్ట్ ఒకటో తేదీన సమావేశమై చర్చించనుంది. న్యూక్ డిల్ విషయం లో ఐ. ఏ. ఈ. ఏ. బోర్డ్ లోని సభ్య దేశాల విశ్వాసం పొందడం తప్పనిసరి . న్యూక్ డిల్ విషయం లో ఎంతో పట్టుదలతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మన్మోహన్ సింగ్ తన ప్రధాని పదవిని పణంగా పెట్టి న్యూక్ డిల్ జూదం ఆడుతున్నారు. అణు ఒప్పందం ఎంత తొందరగా అమలు అవుతుందా అని అమెరికా కూడా కళ్ళలో వత్తూలు వేసుకొని చూస్తోంది. అణు ఒప్పందం విషయం లో శుక్రవారం జరగనున్న సమావేశం చర్చల పై బుష్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




