| << Newer | Older >> |
on 2008/9/13 7:19:11
హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న వినాయక నిమజ్జనానికి సంబందించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. హుసేన్ సాగర్ వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ నిమజ్జనం కార్యక్రమం జరగడానికి అవసరమైన అన్ని సన్నాహాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయా సంఘటనలు జరగ కుండా పోలీస్ నిఘాను ఏర్పాటు చేశారు. నిమజ్జనం ర్యాలీ సాగే ప్రతి కూడలి వద్ద నిఘా కెమరాను అమర్చారు. ర్యాలీని చిత్రీకరించడానికి వీడియో కెమెరాలను ఏర్పాట్లు చేశారు. అధివారం నిమజ్జనం జరగనుంది అందుకని తనిఖీల నిర్వహణకు బాంబ్ నిర్వీర్య బృందాలను, మెటల్ డిటెక్టర్ బృందాలను రంగం లోకి దింపారు. నగరమంతా అణువణువూ గాలిస్తున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ లతో పాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు సోదాలు ముమ్మరం చేశారు. ఈ సారి నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పోలీసుల అంచనా. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగడానికి ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. కొన్ని ఆంక్షలను కూడా పెట్టారు. ఫ్లై ఓవర్ల పై వాహనాలను అనుమతించరు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



