| << Newer | Older >> |
on 2008/7/22 7:37:47
లోక్‌సభ లో విశ్వాస పరీక్ష ఓటింగ్ లో పాల్గొనడానికి అస్వస్తులైన ఐదుగురు బి. జె. పి. ఎం. పి.లలొ నలుగురు డిల్లీకి చేరుకున్నారు. ఇంకో ఎమ్.పి. డిల్లీ చేరుకోవాల్సి ఉంది. బీకానీర్ ఎం. పి. , సినీ నటుడు ద ర్మెంద్ర అమెరికా నుంచి సోమవారం రాత్రి డిల్లీకి చేరుకున్నారు. మోకలికి ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ద ర్మెంద్ర పార్టీ ఆదేశాల మేరకు అమెరికా నుంచి వచ్చారు. ఇక మహా రాష్ట్ర కు చెందిన ఎం .పి. రమేశ్ కూడా సోమవారం రాత్రి డిల్లీ కి చేరుకున్నారు. మాజీ ప్రధాని, సీనియర్ నేత వాజ్‌పాయి తన వీల్ ఛైర్ లో కూర్చొని పార్లమెంట్ లాబీ నుంచి ఓటు వేయనున్నారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఎం. పి. కిషన్ లాల్ కూడా ఓటింగ్ కు హాజరు కానున్నారు. మరో ఎం .పి. మహేష్ చంద్ర కానోరియా ముంబై లోని ఆసుపత్రిలో ఆపరేషన్ అనంతరం వార్డులో ఉన్నారు. నలుగురు ఎమ్.పి. లు ఓటింగ్ లో పాల్గొన్నారు. వారంతా లాబీలోనుంచి ఓటు వేశారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



