| << Newer | Older >> |
on 2008/10/5 4:52:35
తెలుగుదేశం పార్టీ అధినేతకు కొన్ని విషయాలు రుచించవు. పార్టీలో అన్ని తానేనని అనుకుంటుంటారు. ఎవరిని నమ్మరన్న ప్రచారం కూడా ఉంది. అలాంటి చంద్రబాబు ఇపుడు తప్పని సరి పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో రాజీపడి సర్దుకొని పొవాల్సి వస్తోంది. ఎన్. టి. ఆర్. ను అధికారం లోనుంచి దింపి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తరువాత క్రమంగా ఎన్. టి. ఆర్. పేరు ఎక్కడ వినిపించకుండా ఆయన బొమ్మ ఎక్కడ కనిపించకుండా జాగ్రత పడ్డారు. ఎన్. టి. ఆర్. ఇమేజ్ నుంచి పార్టీని బైట పడేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్. టి. ఆర్. ప్రవేశ పెట్టిన పథకాల్లో కొన్ని ఆట కెక్కించారు. మరికొన్నిటికి పేర్లు మార్చారు. ఎలాగో అధికారం లోకి వచ్చారు. 2004 లో జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్షం లో కూర్చున్నారు. తొమ్మిదేళ్ళు అధికారం ఉండి ఒక్క సరిగా ప్రతిపక్షం లో కూర్చోడం అంటే ఎవరికైన చాలా కష్టమే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2009 ఎన్నికల్లో ఓడించి అధికారం లోకి రావాలన్నా లక్ష్యం తో చంద్రబాబు వామపక్షాలతో దోస్తీకి సిద్ద అయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టా నంత వరకు పరిస్థితి బాగానే ఉంది. చిరు పార్టీ ప్రభావం టి. డి. పి. పై చాలా ఎక్కువగానే ఉంది. టి. డి. పి. కి చెందిన చాలామంది సీనియర్లు పి. ఆర్. పి. లోకి వెళ్ళి పోయారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం లోకి రావాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబు టి. ఆర్. ఎస్. ను దారిలోకి తెచ్చుకోడానికి , తెలంగాణాలో ఓట్లు, సీట్ల శాతం పెంచుకోడానికి తెలంగాణకు అనుకూలంగా అనిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి మొదటి నుంచి టి. డి. పి. ది సమైక్య వాదం. అధికారం దక్కించుకోడానికి తనకు ఇష్టం లేకపోయినా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోడానికి సిద్దం అవుతున్నారు. టి. డి. పి. తెలంగాణా విషయం లో సానుకూలంగా లేదన్న దానిపై అలిగిన దేవేందర్ పార్టీ నుంచి బైటకు వచ్చి విడిగా పార్టీ పెట్టారు. దేవేందర్ అలా పార్టీనుంచి బైటకు వచ్చారో లేదో ఇలా బాబు తెలంగాణకు అనుకూలంగా పావులు కదపడం మొదలు పెట్టారు.
ఒక పక్క ప్రజారాజ్యం పార్టీ ప్రభావం,మరోపక్క రానురాను పార్టీ నుంచి వలసలు పెరిగి పోవడం తో పార్టీని పరిరక్షించుకునే యత్నం లో బాగంగా నందమూరి నట వారసులను పార్టీ తరుపున ప్రచారం లోకి దింపడానికి రంగం సిద్దం చేశారు. పలు సార్లు నందమూరి వారసులను విందులకు పిలిచి చర్చలు జరిపారు. తన బావమరిది, వియ్యంకు డు అయిన బాలకృష్ణ ను ప్రచార రంగం లో దింపి చిరు గ్లామర్ కు అడ్డుకట్ట వేయాలని బాబు ఆలోచించి దాన్ని అమలు చేయనున్నారు. బాలకృష్ణ కూడా తన తండ్రి స్థాపించిన పార్టీకి పూర్వ వైభవం సంతరించిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అక్కడి దాకా అంత బాగానే ఉంది. బాలకృష్ణ తో పాటు కల్యాణ్ రామ్, తారక రత్న, జూనియర్ ఎన్. టి. ఆర్. లను కూడా రంగం లోకి దింపి వారితో ప్రచారాన్ని నిర్వహించాలని బాబు అనుకున్నారు. అందరినీ ఒక్క వేదిక మీదనుంచి పరిచేయం చేయాలని దానికి గాను ఈ నెల 24 న యువ గర్జన పేరిట గుంటూరు లో ఒక భారీ బహిరంగ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆదివారం బాలకృష్ణ నాచారం లోని రామకృష్ణ స్టూడియో లో తన అభిమానులతో భేటీ ని నిర్వహించారు. రాష్ట్రం నలుములనుంచే కాకుండా పొరుగు రాష్ట్ర లానుంచి కూడా అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. రామకృష్ణ సినీ స్టూడియో అభిమానుల కోలా హలమ్ తో నిండి పోయింది. ఎన్. టి. ఆర్. స్థాపించిన పార్టీని తిరిగి అధికారం లోకి తీసుకొని రావడానికి అభిమానులందరు కృషి చేయాలని బాలకృష్ణ కోరారు. చంద్రబాబు తో మాట్లాడి అభిమానుల్లో కొందరికి టికెట్లు కూడా ఇప్పిస్తానని బాలకృష్ణ హమీ ఇచ్చారు. ఇది బాబుకు నిజంగా రుచించని విషయం.
నందమూరి వారసులు పార్టీ తరుపున ప్రచారానికి దిగడం చంద్రబాబుకు ఒక పక్క సంతోషాన్ని కలిగిస్తున్న మరోపక్క గుబులు కూడా ఉంది. నందమూరి వారసులు కాని , బాలకృష్ణ అభిమానులు గాని ఎవరైన చెబుతున్నదొకటే కాబోయే ముఖ్యమంత్రి బాలకృష్ణ అని. దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. నందమూరి వారసుల నోట ఎంత సేపు బాబాయి బాలకృష్ణ పేరు వస్తుందే తప్ప చంద్రబాబు నాయుడు పేరు రావడం లేదు. ఇక బాబు కు కూడా తప్పని సరి పరిస్థితుల్లో ఎన్. టి. ఆర్. పేరును ఉచ్చరించాల్సి వస్తోంది. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలవాలన్న, తాను ముఖ్య మంత్రి కావాలన్నా ఎన్. టి. ఆర్. నామ జపం తప్పదని గ్రహించారు.
ఆదివారం ప్రకాశం జిల్లాలోని సంతనూతల పాడు నుంచి ఒంగోల్ వరకు నిర్వహించిన రోడ్ షో లో ఎన్. టి. ఆర్. ను ఆకాశానికి ఎత్తారు. తనకు స్పూర్తి ప్రదాత ఆయనే నని అన్నారు. ఎన్. టి. ఆర్. బొమ్మ పెట్టుకొని ప్రచారం చేస్తే విజయం తద్యం అని అన్నారు. ఎన్. టి. ఆర్. తనకు అరాద్య దైవం అని దండం పెట్టారు. ఆత్మ విశ్వసానికి మారు పేరు ఎన్. టి. ఆర్. అని అడుగడుగున ఆయన నామాన్ని జపీంచారు. ఎన్. టి. ఆర్. విగ్రహానికి పూల మాల వేసి నమస్కరించారు. ఇదంతా పిల్ల నిచ్చిన మామ గారి మీద ప్రేమా కాదు, భక్తి, గౌరవం అంత కన్నా కాదు. పదవి, అధికారం నాయకుల చేత ఏమైన చేయిస్తుందనడానికి ఇదో నిదర్శనం ! కాదంటారా బాబుగారు!!
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



