| << Newer | Older >> |
on 2008/5/9 6:20:49
పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి అనం రామ నారాయణ రెడ్డి చెప్పారు. రాష్ట్రం లోని వివిద సమస్యల పై శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశం లో చర్చించి నట్లు తెలిసింది. ఈ నెల లో జరగనున్న ఉపఎన్నికలను గురించి కూడా మంత్రి మండలి లో చర్చ జరిగింది. రాష్ట్రానికి 19 వేల టన్నుల పామోలిన్ ఆయిల్ ను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాలని మంత్రి మండలి నిర్ణయించింది. పునరంకిత సభ ఏర్పాట్లు గురించి సమావేశం లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 12 నుంచి జూన్ నెల 3వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు చైతన్య యాత్రలు నిర్వహించాలా మంత్రి మండలి నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డ్ వినియోగదారులకు చౌక డిపోల ద్వారా జూలై నెల నుంచి కందిపప్పు, పామోలిన్ ఆయిల్ ను అందివ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



