| << Newer | Older >> |
on 2008/7/17 4:17:27
దేశ రక్షణ కోసమే అణు ఒప్పందాన్ని అమలు చేయాలని తమ ప్రబుత్వం నిర్ణయించిందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. గురువారం నెల్లూరు లోని ఏ. సి. సుబ్బారెడ్డి స్టేడియం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఆమె ప్రసంగించారు. అణు ఒప్పందం దేశానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. తమ యు. పి. ఏ. ప్రభుత్వ విదేశాంగా విధానం ప్రపంచం లోని అన్ని దేశాల మెప్పు పొందిందని తమ విధానానికి విపక్షాలు సర్టిఫై చేయనక్కర లేదని సోనియా తెలిపారు.
అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉందని. దేశంలోనే ఆంధ్ర ముందుందని సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది చెందిందని తెలిపారు. .దేశానికి వెన్నుముక లాంటి రైతాంగాన్ని అన్ని రకాల ఆదుకోడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. రైతులకు ఇతోదికంగా సహాయపడాలన్న తపనతో పాటు వారిని అన్ని విదాల ఆదుకోడానికి రైతు రుణ మాఫీ పథకాన్ని అమలు పరుస్తున్నామని చెప్పారు. రుణ మాఫీ పథకం కింద రాని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాయితీ కల్పించిందని కూడా సోనియాగాంధీ అన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోడానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తోందని అన్నారు. వ్యవసాయ పనులు లేని కాలం లో రైతు కూలీలను ఆదుకోడానికి ఉపాది హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదిలో కనీసం 100 పని రోజులు కల్పించడానికి తగిన విధంగా పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. విధ్య, వైధ్య ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. సభలో ప్రసంగించడానికిముందు అందరికి నమస్కారం. అందరు బాగున్నారా అని తెలుగులో మాట్లాడి అందరికి అభివాదం చేశారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



