| << Newer | Older >> |
on 2008/7/14 4:58:02
అణుఒప్పందానికి వ్యతిరేకంగా ఈ నెల 20 వ తేదీన దేశవ్యాప్త బంద్ కు సి. పి. ఐ. పార్టీ పిలుపునిచ్చింది. ఒకపక్క అధిక ధరలు ప్రజలను కుంగ దీస్తుంటే మరోపక్క ప్రధానికి అణు ఒప్పందం చేసుకొని బుష్ వద్ద మెప్పు పొందలన్న తపన ఎక్కువ గా ఉందని వామపక్షాలు కూడా అంటున్నాయి. ద్రవ్యోల్భణం దేశాన్ని కుదిపివేస్తోందని దానిని అదుపు చేయడానికి ప్రధాని గాని ఆర్థిక మంత్రిగాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న సి. పి. ఎం. సోమవారం నుంచి దేశ వ్యాప్త ఆందోళనకు దిగింది. అణు ఒప్పందం వల్ల జరగనున్న అనర్థలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచారం నిర్వహించనుంది. ఉద్యమాలు ఆందోళనలతో యు.పి. ఏ. వైఖరిని ఎడ్డగట్టడానికి సిద్దం అయింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



