| << Newer | Older >> |
on 2008/6/12 7:00:34
ఉప ఎన్నికల అనంతరం తెలుగు దేశం పార్టీలో తెలంగాణా విషయం పై మొదలైన వివాదం రోజురోజుకూ ముదిరి పాకాన పదుథొన్ది.తెలన్గన అనుకూల వాదాన్ని వినిపించిన దేవేందర్ గౌడ్ పై పార్టీ అధికార ప్రతినిది తలసాని ఎదురు దాడికి దిగడం ఆయన పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. పొలిట్ బ్యూరో సమావేశానికి ఒక రోజు ముందు తలసాని చేసిన వ్యాఖ్యల వెనుక ఎనమల హస్తం ఉందని దేవేందర్ గౌడ్ నేరుగా పార్టీ అధినేతఏడూతనే ఎనమల ముందే చెప్పడం , పార్టీ అధినేతను కూడా ఈ విషయం లో అనుమానించడం జరిగింది. తన పై తీవ్ర మైన వ్యాఖ్యలు చేయడానికి మునుపు తలసాని తనతో ఎంతో చక్కగా మాట్లాడదని ఇంతలోనే అతని వైఖరిలో అంత మార్పు ఎలా వచ్చిందని దేవేందర్‌గౌడ్ అనుమానం వ్యక్తం చేయడం తో అందరు మిన్న కుండి పోయారు. పొలిట్ బ్యూరో సమావేశం లో కూడా తెలంగాణా అంశం పై వాడిగా వేడిగా చర్చ జరిగింది దేవేందర్ తో పార్టీ అధినేత చంద్రబాబు దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు. దేవేందర్ పై కాస్త కోపం ప్రదర్శించారు. ఆ తరువాత జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం లోను తెలంగాణా పై దేవెనదర్ తన వైఖరిని గట్టిగానే చెప్పారు. దేవేందర్ ను కూడా పార్టీ లో నుంచి పంప డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవేందర్‌కు కూడా అనుమానం బైట పడలేదు. గురువారం గుత్తా కూడా దేవేందర్ తో బేటీ అవడం గమనార్హం. ఒక వేళ ఏ కారణంగా నైనా గుట్టాను గాని , దేవేందర్ ను గాని బైటకు పంపితే దానిని ఎదుర్కోడానికి వారు మానసికంగా సిద్దం అయ్యారని సమాచారం దేవేందర్ గౌడ్ కు చిరు నుంచి ఆహ్వానం ఉందని వదంతాలు వినిపిస్తున్నాయి. పార్టీ సస్పెన్షన్ చేస్తే బైటకు వెళ్ళి మరో పార్టీలో చేరడానికి గుత్తా కూడా సిద్దం అవుతున్నారని వినికిడి. వీరిద్దరితో పాటు మరెంత మంది వెళతారో చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



