| << Newer | Older >> |
on 2008/9/18 11:55:56
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పై రాష్ట్రంలోని ఆంధ్ర , రాయలసీమ ప్రాంతాలతో పోల్చుకుంటే తెలంగాణా ప్రాంతం లో స్పందన చాలా తక్కువుగా ఉంది పార్టీని ప్రకటించి మూడువారాలు అవుతున్న తెలంగాణాలో ఆ పార్టీ పట్ల నేతల ఆసక్తి పెద్దగా కనిపించడం లేదు తెలంగాణా ప్రాంతం నుంచి పేరున్న ఒక్క పెద్ద నాయకుడు కూడా చిరు పార్టీలోకి వెళ్లలేదు. చిరంజీవి పై అభిమానం లేక కాదు, ఆయన పై విశ్వాసం సన్నగిల్లి కాదు కాకపోతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా విపక్షాలన్ని కలిసి మహా కూటమి గా ఏర్పడే అవకాశాలు కనిపిస్తుండటం తో పలు పార్టీలు, వాటి నేతలు కొంచెం తట పాట యిస్తున్నారు. తెలంగాణాలో వామపక్షాలకు పట్టు ఎక్కువగా ఉంది. దానికి తోడు ఎన్నికలు ముంచుకొస్తుండటం తో అన్ని పార్టీలు తెలంగాణా మంత్రాన్ని జపిస్తున్నాయి. తెలంగాణా కోసం ఉద్య మిస్తున్న టి. ఆర్. ఎస్. , నవ తెలంగాణా ప్రజా పార్టీ, తల్లి తెలంగాణా పార్టీ ఉద్యమ సంస్థలు, తెలంగాణా వాదులు అందరు కలిసి ఒక ఫ్రంట్ గా ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే టి. డి. పి. , బి. జె. పి. పార్టీలు తెలంగాణా కు అనుకూలంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకం కాకపోయినా ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. చిరు పార్టీకూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



