| << Newer | Older >> |
on 2008/10/10 8:54:30
రానున్న ఎన్నికల్లో తెలంగాణా అంశం చాలా కీలక పాత్ర పోషిస్తుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ విషయం లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలంగాణా అనుకూల పార్టీలు అంటుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారం కోసమే చంద్రబాబు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాభీష్టం మేరకు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. తాము గత నాలుగేళ్లుగా తెలంగాణ విషయం గురించి ముచ్చటించినపుడు ఏమీ మాట్లడని టి. డి. పి. ఇపుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం లో స్వార్థం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నిర్ణయం వెనుక తెలంగాణా పై ప్రేమ లేదని రానున్న ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓట్లు సాదించాలన్న తపన కనిపిస్తోందని వాదిస్తున్నారు. అవన్నీ నిజం కావచ్చు. అధికారం కోసమో స్వార్థం తోనో ఏదైన పాతికేళ్లుగా సమైక్య వాదాన్ని వినిపిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా తన విధానాన్ని మార్చుకొని తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంది. మరి కాంగ్రెస్ మాటేమిటి.? 2004 ఎన్నికల సమయం లో కాంగ్రెస్ ఎం చెప్పింది? ఏ అంశం ప్రతిపదికగా తెలంగాణా రాష్ట్ర సమితి తో పొత్తు పెట్టుకుంది. కేంద్రం లో , రాష్ట్రం లో అధికారం లోకి వచ్చిన తరువాత తెలంగాణా విషయం లో ఎలాంటి వైఖరిని అనుసరించింది. కాంగ్రెస్ నేతృత్వం లోని యు. పి. ఏ. అధికారం లోకి వచ్చిన తరువాత తెలంగాణా అంశం పై ఏకాభిప్రాయ సాధన పేరుతో ప్రణబ్ నేతృత్వం లో ఏర్పాటైన త్రీ సభ్య కమిటీ ఇ నాలుగున్నరేళ్ల కాలం లో ఎందుకుగాను ఏకాభిప్రాయ సాదించలేక పోయింది. నిజంగా తెలంగాణా ఇవ్వలనుకుంటే ఏకాభిప్రాయం పెద్ద సమస్య కాదు. కాని తెలంగాణా ఇస్తే ఆ క్రెడిట్ తెలంగాణా రాష్ట్ర సమితి కి దక్కుతుంది ఆది ఇష్టం లేకనే జాప్యం చేస్తోందన్నది నగ్న సత్యం. ఒకసారి కమిటీని నియమించిన తరువాత ఆ కమిటీ ఎం చేస్తోందో కూడా పట్టిచుకొని కాంగ్రెస్ ఆ తరువాత రెండో ఎస్. ఆర్. సి. ని తెరపైకి తీసుకొని రావడం అంటే ప్రణబ్ కమిటీ ని పక్కన పెట్టినట్లే కాదా! అసలు ప్రణబ్ కమిటీ ఎన్ని సార్లు సమావేశమైంది? ఎం సాదించింది? ఇందులో తెలంగాణా రాష్ట్ర సమితి తప్పు కూడా చాలా ఉంది. తెలంగాణా కోసం ఉద్యమించిన టి. ఆర్. ఎస్. దానికోసం పోరాడకుండా అధికారం లో ఉంటే ప్రభుత్వం ద్వారా తెలంగాణా సాదించుకోవచ్చునన్న ఒక తప్పుడు అడుగు వేసి చాలా నష్టపోయిందనే చెప్పాలి. ఒక్కసారి అధికార రుచి మరిగితే ఉద్యమం ఆట కేక్కుతుందని కె. సి. ఆర్. లాంటి తలపండిన రాజకీయ నేత కూడా గ్రహించలేక పోవడం విచారకరం. అధికార మత్తు నుంచి బైట పడే సరికి జరగాల్శిన నష్టం జరిగి పోయింది. టి. ఆర్. ఎస్. పై తెలంగాణప్రజలకు విశ్వాసం, నమ్మకం పోయింది. అందుకే ఉపఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.
తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉందని, తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ఉపఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ఎం చేసింది. అభివృద్ది కి మాత్రమే ప్రధాన్యతను ఇచ్చింది. తాము తెలంగాణకు వ్యతిరేకమని ఎందుకు తెగించి చెప్పలేక పోతోంది? లేదా సి. పి. ఎం లాగా తమ ది సమైక్య వాదమని స్పష్టం చేయకపోవడానికి కారణం ఏమిటి? అవకాశవాద రాజకీయం కాదా? తెలుగుదేశం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు తమ పార్టీ వైఖరిని ఎందుకు చెప్పలేక పోతున్నారు? ప్రణబ్ కమిటీకి కాంగ్రెస్ ఇప్పటిదాకా తన వైకాఖరిని స్పష్టం చేస్తూ లేఖను ఇవ్వలేదు. దాన్ని గురించి ముందు ఆలోచించాలి. ఒకరిని వేలెత్తి చూపుతున్నపుడు మిగిలిన మూడు వెళ్లు మన వైపు చూస్తున్నాయని గ్రహించాలి. మన దేశం లోని ఏ రాజకీయ పార్టీ అయినా నీతి గా, నిజాయితీగా ఉందా? చెప్పిన మాటకు కట్టుబడి ఉందా? తెలంగాణా ప్రజల్లో విశ్వాసం పొందడానికి కనీసం అసెంబ్లీలో తెలంగాణా బిల్లు పెట్టడానికి అటు కాంగ్రెస్ , ఇటు టి. డి. పి. చిత్త శుద్దితో ప్రయత్నించిందా? అసెంబ్లీ లో తీర్మానం చేసినంత మాత్రాన తెలంగాణా రాదు . ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చూపి ఉంటే ఇవాళ టి. డి. పి. డి అవకాశ వాద నిర్ణయమని వీయమ్ర్షించడానికి కాంగ్రెస్ హక్కు ఉండేది. టి. డి. పి. ది అవకాశ వాదం అని తెలంగాణా ప్రజలు విశ్వసించే వారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాపై తన వైఖరిని తేల్చి చెప్పి ప్రజల తీర్పు కోరాలి. రానున్న ఎన్నికల్లో ప్రజల తీర్పుకు అనుగుణంగానే అధికారం లోకి వచ్చే పార్టీ తెలంగాణాపై తన నిర్ణయాన్ని తీసుకోవాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



